హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖైరతాబాద్ వైపు నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపునకు.. ఓ కారు వేగంగా వచ్చి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో.. కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు.
ఎన్టీఆర్ మార్గ్‌లో కారు బోల్తా.. నలుగురికి గాయాలు - ఎన్టీఆర్ మార్గ్‌లో ప్రమాదం
వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో జరిగిందీ ఘటన. గాయల పాలైన ప్రయాణికులను.. ట్రాఫిక్ పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

కారు బోల్తా
ట్రాఫిక్ పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రహదారిపై బోల్తా పడిన కారును తొలగించారు. బాధితుల వివరాలతో కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:మూడేళ్ల ప్రేమ... పెళ్లనగానే ముఖం చాటేసిన ప్రజా ప్రతినిధి