నిషేధిత మిరప విత్తనాలు, గడ్డి మందును పెద్దపల్లి టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంగాపూర్ గ్రామ శివారులో తనిఖీలు చేపట్టిన పోలీసులు రూ.13.77 లక్షల విలువైన నకిలీ విత్తనాలు, పురుగుల మందులను సీజ్ చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అంతరాష్ట్ర ముఠా గుట్టు ఛేదించామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు.
భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం దానంపల్లికి చెందిన శ్రీనివాస ఎరువుల దుకాణం యజమాని శ్రీనివాస్... రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన యూఎస్-341 రకం మిర్చి విత్తనాలతోపాటు నిషేధిత గడ్డి మందులు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని సీపీ తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్లోని సదరు కంపెనీపై దాడులు నిర్వహించి పత్రాలను సీజ్ చేసినట్లు తెలిపారు.