Traffic Probationary SI Suicide: హైదరాబాద్ మౌలాలీ రైల్వే స్టేషన్ సమీపంలో గల రైల్వే ట్రాక్‌పై ట్రాఫిక్ ప్రొబేషనరీ ఎస్సై రమణ బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం వాసుదేవపురం గ్రామానికి చెందిన రమణ.. 2020లో పోలీస్‌శాఖలో ట్రైనీ ఎస్సైగా విధుల్లో చేరారు. ప్రస్తుతం ప్రొబేషనరీ ఎస్సైగా ఉన్న ఆయన.. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ఎస్సై ప్రతాప్, ముగ్గురు స్నేహితులతో కలిసి చిక్కడపల్లి అశోక్‌నగర్‌లో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పని ఉందంటూ బయటకు వెళ్లారు.
రైలు కింద పడి ట్రాఫిక్ ప్రొబేషనరీ ఎస్సై ఆత్మహత్య
Traffic Probationary SI Suicide: రైలు కింద పడి ట్రాఫిక్ ప్రొబేషనరీ ఎస్సై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలోని మౌలాలీ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
గురువారం ఉదయం మౌలాలీ-చర్లపల్లి రైల్వేస్టేషన్ల మధ్య బీ క్యాబీన్ ప్రాంతంలో రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లుగా రైల్వే కీమ్యాన్ వెంకటేశ్వర్‌రావు గుర్తించారు. ఈ విషయాన్ని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అధికారుల ద్వారా జీఆర్పీ పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా మృతుడిని ఎస్సై రమణగా గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసు ఉన్నతాధికారులకు ముందస్తు సమాచారం అందించి అనంతరం మృతుడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. దర్యాప్తు చేస్తున్నామని జీఆర్పీ సీఐ ఎం.శ్రీను తెలిపారు.
ఇవీ చదవండి: