తెలంగాణ

telangana

ETV Bharat / crime

Ts Police: ఏపీ హైకోర్టు న్యాయవాది అరెస్టు.. మావోయిస్టులతో సంబంధాలే కారణమా!

ఏపీ హైకోర్టు న్యాయవాదిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులతో న్యాయవాదికి సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడకు చెందిన అంకాల పృథ్వీరాజ్​ పూసుగుప్ప-ఛత్తీస్‌గఢ్‌లోని రాంపురం-మల్లంపేట అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేత దామోదర్‌ను కలిసి వస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

AP High Court lawyer arrested
ఏపీ హైకోర్టు న్యాయవాది అరెస్టు

By

Published : Sep 1, 2021, 9:31 AM IST

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాది అంకాల పృథ్వీరాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన ఆయన పూసుగుప్ప-ఛత్తీస్‌గఢ్‌లోని రాంపురం-మల్లంపేట అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేత దామోదర్‌ను కలిసి వస్తున్నట్లుగా విచారణలో వెల్లడైందని సీఐ అశోక్‌ తెలిపారు.

మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన శైలేంద్ర ముఖర్జీ ఆగస్టు 7న చనిపోగా, ఆయన ఆశయాలను కొనసాగించాలని ఉన్న కరపత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పృథ్వీరాజ్‌ను అరెస్టుచేసి న్యాయస్థానానికితరలించినట్లు సీఐ తెలిపారు.

ఇదీ చదవండి: SCHOOLS REOPEN: రాష్ట్రంలో తెరచుకోనున్న విద్యాసంస్థలు

ABOUT THE AUTHOR

...view details