తెలంగాణ

telangana

ETV Bharat / city

స్వస్థలాలకు రైలు సౌకర్యం కోసం వలస కూలీల ఆందోళన.. - need of arrangements

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో తమను స్వస్థలాలకు తరలించాలని వలస కార్మికులు ఆందోళన బాట పట్టారు. లాక్​డౌ​న్ వల్ల ఉపాధి కోల్పోయి తిండి తిప్పలు లేక, తాగేందుకు నీరు లేక కుటుంబాలతో నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

సొంతూర్లకు పంపాలని ఆందోళన బాట పట్టిన వలస కార్మికులు
సొంతూర్లకు పంపాలని ఆందోళన బాట పట్టిన వలస కార్మికులు

By

Published : May 7, 2020, 3:00 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో వలస కార్మికులు ఆందోళన చేపట్టారు. తమను స్వరాష్ట్రాలకు తరలించాలని కోరుతూ రోడ్డెక్కి నిరసన తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వందలాది వలస కూలీలను పోలీసులు హంటర్ రోడ్​లోని విష్ణుప్రియ గార్డెన్​కు తరలించారు.

రాత్రి నుంచి తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు రైలు సౌకర్యం కల్పించి స్వస్థలాలకు పంపించాలని వేడుకుంటున్నారు. లాక్​డౌన్ వల్ల పిల్లపాపాలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తాగేందుకు కనీసం నీరు కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతమంది ఒకే చోట ఉండటం వల్ల తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : విశాఖ ఘటనపై ప్రధాని మోదీ విచారం

ABOUT THE AUTHOR

...view details