తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎగ్జామ్​ పేపర్ చూసి విద్యార్థుల మైండ్‌ బ్లాక్‌

ఇంటర్‌ పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్య వైఖరి మరోసారి బట్టబయలైంది. ఇంటర్‌ వృత్తి విద్యా కోర్సులో వర్క్‌షాప్‌ టెక్నాలజీ ప్రశ్నాపత్రం ఇవ్వాల్సి ఉండగా.. కోర్సుకు సంబంధం లేని పేపర్‌ విద్యార్థుల ముందు ప్రత్యక్షమైంది. ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల పరీక్ష కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఎగ్జామ్​ పేపర్ చూసి విద్యార్థుల మైండ్‌ బ్లాక్‌
ఎగ్జామ్​ పేపర్ చూసి విద్యార్థుల మైండ్‌ బ్లాక్‌

By

Published : Mar 10, 2020, 5:02 PM IST

ఖమ్మం జిల్లా వైరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల పరీక్ష కేంద్రంలో ఇంటర్‌ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులకు ఒక్కసారిగా మైండ్‌ బ్లాక్‌ అయింది. వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 24 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందరికి 9 గంటలకు ప్రశ్న పత్రం అందజేశారు. వృత్తి విద్యా కోర్సులో వర్క్‌షాప్‌ టెక్నాలజీ ప్రశ్నాపత్రం ఇవ్వాల్సి ఉండగా.. కోర్సుకు సంబంధం లేని పేపర్‌ విద్యార్థులకు ఇచ్చారు. గమనించిన విద్యార్థులు విషయాన్ని పరీక్షల నిర్వాహకులకు తెలియజేశారు.

45 నిమిషాల ఆలస్యంగా..

పరీక్షా కేంద్రం చీఫ్ సూపరిండెంట్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సత్తుపల్లి కేంద్రం నుంచి వర్క్‌షాప్‌ ప్రశ్నాపత్రం వచ్చేసరికి 45 నిమిషాలు దాటిపోయింది. ఆ సమయాన్ని సాధారణ పరీక్ష సమయం కంటే పొడిగించారు. ప్రశ్నాపత్రాలు ఆలస్యం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వరకు ఆ విద్యార్థులు ఆందోళన చెందారు. చివరకు ఆలస్యమైనా సమయాన్ని అదనంగా ఇవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు.

ఎగ్జామ్​ పేపర్ చూసి విద్యార్థుల మైండ్‌ బ్లాక్‌

ఇవీ చూడండి:52 గంటలపాటు శిథిలాల కిందే తల్లీకొడుకు.. సురక్షితం

ABOUT THE AUTHOR

...view details