రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల వైఖరిని నిరసిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కార్యాలయంలో స్వీయ నిర్బంధంలో దీక్షను చేపట్టారు. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. భాజపా శ్రేణులను భయపెడుతూ అక్రమ కేసులు పెట్టిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆయన సోమవారం రాత్రి 9.30గంటల నుంచి దీక్షలో ఉన్నారు.
బండి సంజయ్ దీక్ష.. పార్టీ శ్రేణుల ఆందోళన
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వీయ నిర్బంధంలో దీక్షను చేపట్టారు. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని సోమవారం రాత్రి 9.30గంటల నుంచి దీక్ష నిర్వహించారు. ఎంపీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడం వల్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సంజయ్‌ను పరామర్శించి సంఘీభావం తెలిపారు.
ఎంపీ కార్యాలయం లోపల బండి సంజయ్ కొందరు నాయకులతో ధర్నాలో ఉండగా .. బయట పార్టీ శ్రేణులు ఆందోళనని కొనసాగిస్తున్నారు. దీక్షకు భగ్నం కలిగించొద్దనే ఉద్దేశంతో పలువురు భాజపా నాయకులు, కార్యకర్తలు కార్యాలయం బయట బైఠాయించారు. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కరీంనగర్‌కు తరలివస్తున్నారు. ఇప్పటి వరకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో పాటు మాజీ మంత్రులు డీకే అరుణ, పెద్దిరెడ్డి, బాబూమోహన్ తదితరులు పరామర్శించి సంఘీభావం తెలిపారు.
ఇదీ చూడండి: దుబ్బాకలో భాజపా గెలవబోతోంది: బండి సంజయ్