హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వివాహిత...తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ హబీబ్ ఫాతిమా నగర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టింది.
కుటుంబ సభ్యులకు తెలియకుండా విశాఖపట్టణంలో ఆరిఫ్ వివాహం చేసుకున్నాడని బాధితురాలు తెలిపింది. కొన్ని నెలల పాటు విశాఖలోనే నివసించామని పేర్కొంది. కుమారుడు జన్మించిన కొన్ని రోజులకే ఆరిఫ్ హైదరాబాద్లోని తన తల్లిదండ్రులకు వద్దకు వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది.