Floods in Zoo Park: భారీ వర్షాలకు హైదరాబాద్ బహదూర్‌పురా నెహ్రూ జూపార్కులో భారీగా వరదనీరు చేరింది. పెద్దఎత్తున వరద నీరు చేరటంతో.. సఫారీ పార్కును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. జంతువులన్ని ఎన్‌క్లోజర్‌లో సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. జంతువులకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
జూపార్కుకు అనుకుని మీర్ అలం చెరువు ఉండడం వల్ల.. దాని ఔట్ ఫ్లో ఒకటి సఫారీ పార్క్ గుండా మూసిలోకీ వెళ్తుంది. ఒకపక్క వరద నీరు.. మరోపక్క మీర్ అలం చెరువు ఔట్ ఫ్లో నీరు ఒక్కసారిగా రావడంతో సఫారీ పార్కులో భారీగా నీళ్లు చేరినట్లు అధికారులు తెలిపారు. సపారీకి వేళ్లే దారులలో ప్రమాదకర స్థాయిలో నీరు చేరడంతో పార్కును మూసివేసినట్లు పేర్కొన్నారు. నీరు పూర్తిగా తగ్గిన తరువాత సఫారీ పార్క్‌ను తిరిగి తెరుస్తామని పేర్కొన్నారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.