తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనానంతరం ప్రసాదం ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ కొంతమంది భక్తులు ఆందోళనకు దిగారు. తితిదే అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తూ... కొంతమందికి మాత్రమే ప్రసాదాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఉదయం విరామ సమయ దర్శనం అనంతరం భక్తులు మహాద్వారం ప్రాంతంలో నిరసనకు దిగారు. పోటు కార్మికులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
'తితిదే అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు' - తిరుమల తిరుపతి తాజా వార్తలు
తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనానంతరం ప్రసాదం ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ కొంతమంది భక్తులు ఆందోళనకు దిగారు. తితిదే అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తూ...కొంతమందికి మాత్రమే ప్రసాదాలు ఇస్తున్నారని ఆరోపించారు.

'తితిదే అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు..'
ఆలయ అధికారులు వారిని నచ్చచెప్పి బయటకు పంపారు. ఆలయం వెలుపల వచ్చిన వారు... తితిదే అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రసాదాలు ఇవ్వకుండా మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ... ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ నిబంధనలతో ప్రసాదాలు పంపిణీ చేయటం లేదని తితిదే అధికారులు తెలిపారు. స్వామివారికి సమర్పించే నైవేద్యాన్ని వృథా చేయకూడదన్న ఉద్ధేశంతో ప్రసాద వితరణ చేస్తున్నామని వివరణ ఇచ్చారు.
ఇదీ చదవండి:'మనుషుల మాదిరి ఆలోచించే యంత్రాలకే డిమాండ్'