ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి వైఖరి సరికాదని తెజస అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్మికులను తొలగిస్తున్నామనడం సీఎం నిరంకుశ ధోరణికి నిదర్శనమని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలనే యోచనలో ఉన్నారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీని సమాధి చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వ చర్యల వల్లే ఆర్టీసీలో సమ్మె అనివార్యమైందని తెలిపారు. మరో సకలజనుల సమ్మెకు సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని... ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే సకలజనుల సమ్మెగా మారుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరం కలుద్దామని కోరారు.
"మరో సకల జనుల సమ్మెకు సమయం ఆసన్నమైంది"
ప్రభుత్వ చర్యల వల్లే ఆర్టీసీలో సమ్మె అనివార్యమైందని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే యోచనలో కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు.
'ఆర్టీసీని సమాధి చేయాలనే కుట్ర జరుగుతోంది'
Last Updated : Oct 9, 2019, 10:37 PM IST