మళ్లీ షురూ... ప్రభుత్వ భూముల వేలానికి సర్కారు సన్నద్ధం!
13:01 August 28
117.35 ఎకరాల వేలానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం
మరో దఫా భూమల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల కోకాపేట, ఖానామెట్‌లోని భూములకు విక్రయించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోమారు ఖానామెట్, పుప్పాలగూడ భూముల వేలాన్ని చేపట్టింది. ఖానామెట్‌లోని 22.79 ఎకరాల విస్తీర్ణం, పుప్పాలగూడలోని 94.56 ఎకరాల భూముల వేలం ప్రక్రియను చేపట్టింది. మొత్తం రెండు చోట్లా కలిపి 117.35 ఎకరాల విస్తీర్ణంలో 35 ప్లాట్లను వేలం వేయనున్నారు. ఇందుకోసం టీఎస్ఐఐసీ సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
సెప్టెంబర్ తొమ్మిదో తేదీన ప్రీబిడ్ సమావేశం నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్లకు 25వ తేదీ వరకు గడువుంటుంది. ఖానామెట్ భూములను సెప్టెంబర్ 27న, పుప్పాలగూడ భూములను 29వ తేదీన ఈ-ఆక్షన్ విధానంలో వేలం నిర్వహిస్తారు. ఇటీవల భూముల విక్రయాలకు వచ్చిన స్పందన ఆధారంగా భూములకు కనీస విలువను ఖరారు చేశారు. ఖానామెట్ భూములకు కనీస విలువ ఎకరానికి 40 లక్షల రూపాయలు, పుప్పాలగూడ భూములకు కనీస విలువ 35 లక్షల రూపాయలుగా ఖరారు చేశారు.