రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు "గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం" లభించింది. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం ఆవశ్యకతపై ఆయన చేపట్టిన "గ్రీన్ ఛాలెంజ్" కార్యక్రమం అవిశ్రాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనకు ఈ పురస్కారం దక్కింది.
మహాత్మాగాంధీ 150వ జన్మదినం పురస్కరించుకుని గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ ప్రతినిధులు ఈ పురస్కారాన్ని ఎంపీ సంతోష్ కుమార్‌కు అందజేశారు. హైదరాబాద్‌లో ఎంపీని ప్రత్యేకంగా సన్మానించి పురస్కారాన్ని బహుకరించారు.
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టామని సంతోష్ తెలిపారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.