తెలంగాణ

telangana

ETV Bharat / city

"ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం నాకులేదు"

భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన ఆరోపణలపై ట్రాన్స్​కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. తెరాస కండువా కోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు.

transco cmd

By

Published : Aug 27, 2019, 8:06 PM IST

'కండువా కప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు'

తనను తెరాస కండువా కప్పుకున్నారని భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించడాన్ని ట్రాన్స్​కో, జెన్కో సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు ఖండించారు. తెదేపా, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనూ పనిచేశానని చెప్పారు. ఏ ప్రభుత్వంలో పనిచేసినా ఏ పార్టీ కండువా వేసుకోలేదని.. వేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వృత్తిపరంగా మాత్రమే పనిచేస్తామని తమపై ఎటువంటి ఒత్తిళ్లు లేవన్నారు. తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని పునరుద్ఘాటించారు. గత ఐదేళ్లలో హైడల్ విద్యుత్ 10,083 మిలియన్ యూనిట్లకు తగ్గిందని వివరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details