తెలంగాణ

telangana

ETV Bharat / city

అత్యంత నిష్టతో "గురువులకు" శిక్షణ..!

ఉపాధ్యాయుల్లో బోధన సామర్ధ్యాలను పెంపొందించి.. విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా జాతీయస్థాయిలో కేంద్రప్రభుత్వం నిష్ఠ కార్యక్రమం రూపొందించింది. ఒకటి నుంచి 8వ తరగతి ఉపాధ్యాయులకు ఇందులో శిక్షణ ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది.

training-for-the-most-loyal-teachers
అత్యంత నిష్టతో "గురువులకు" శిక్షణ..!

By

Published : Dec 20, 2019, 7:33 AM IST


సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాలను ఎంపికచేసి.. ఆరు బృందాలుగా చేసి 38 మంది రిసోర్స్ పర్సన్ ద్వారా 3385 మంది ఉపాధ్యాయులకు "నిష్ట" యాప్​ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో బృందంలో ఒక ప్రధానోపాధ్యాయుడు, ఐదుగురు ఉపాధ్యాయులు ఉంటారు. ఐదు రోజుల పాటు మూడు విడతలుగా ఈ కార్యక్రమం కొనసాగనుంది.

అత్యంత నిష్టతో "గురువులకు" శిక్షణ..!

సాంకేతిక శిక్షణ
ఉపాధ్యాయులకు "నిష్ట" యాప్ ద్వారా చరవాణి ఆధారంగా శిక్షణ నిర్వహిస్తున్నారు. ఇది పూర్తైన తర్వాత మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించేలా కార్యక్రమం చేపడుతున్నారు.

"నిష్ట" ద్వారా ఆశిస్తున్న ఫలితాలు

  1. విద్యార్థుల సామాజిక మానసిక అవసరాలను ఉపాధ్యాయులు సలహాదారులుగా ప్రతిస్పందించాలి.
  2. పాఠశాలలో విద్యార్థి ఆరోగ్య శ్రేయస్సు విధిగా చూడాలి.
  3. విద్యా ప్రణాళిక, విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానాలు, అభ్యసన ఫలితాలు, సమ్మిళిత విద్యను అందించాలి.
  4. ప్రతి విద్యార్థిలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీయాలి. వీటితో పాటు 14 అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.

ఫోక్సో చట్టం - బాలికల ఆత్మరక్షణ అంశాలు
నేటి సమాజంలో పెరుగుతున్న లైంగిక వేధింపుల నుంచి తమను తాము రక్షించుకునే విధంగా విద్యార్ధినుల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. 18ఏళ్ల లోపు బాలబాలికలందరు ఫోక్సో చట్టం పరిధిలోకి వస్తారు. నిత్యం వేధింపులకు గురవుతున్న బాలబాలికలు ఎవరి సహాయం తీసుకోవాలనే విషయం తెలియజేయనున్నారు. యువతులు లైంగిక వేధింపుల నుంచి బయట పడేందుకు ఆత్మరక్షణ కోసం తీసుకోవల్సిన అంశాలను శిక్షణలో వివరించనున్నారు.

ఇవీ చూడండి: జనవరి 2 నుంచి పల్లెప్రగతికి శ్రీకారం

ABOUT THE AUTHOR

...view details