మరో 2,242 కరోనా కేసులు
రాష్ట్రంలో మరో 2,242 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరో 19 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 4,693 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 40,489 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మిత్రుని ప్రాణాలు తీసిన బైకర్
భయమో, అతి నమ్మకమో... ఓ వాహనదారుడు దుస్సాహసానికి ఒడిగట్టి ఒక ప్రాణం పోవటానికి కారణమయ్యాడు. పోలీసులు పెట్టిన గేటును ఆపకుండానే దాటుకుని పోవాలనే లక్ష్యంతో వెళ్లిన వాహనదారుడు... వెనకున్న మిత్రుని పరిస్థితి ఆలోచించలేకపోయాడు. ఈ అనాలోచిత, అవివేక చర్యతో విలువైన నిండు ప్రాణం క్షణంలో గాల్లో కలిసిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దుకాణాల వద్ద కిటకిట.. !
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పన్నెండో రోజు కఠినంగా అమలు చేస్తున్నారు. మొదట్లో చూసీచూడనట్లు ఉండగా.. జనాలు ఎక్కువగా రోడ్లపైకి వచ్చారు. మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం రాకుండా ప్రస్తుత లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల తర్వాత... పోలీసులు ఆంక్షలు పక్కాగా అమలయ్యేలా చూస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఈటల కుమారుడుపై ఫిర్యాదు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు మరో ఫిర్యాదు అందింది. ఈటల కుమారుడు నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారని మేడ్చల్ జిల్లా రావల్కోల్ గ్రామానికి చెందిన పీట్ల మహేశ్ ముదిరాజ్ అనే వ్యక్తి సీఎంకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వధువులిద్దరు.. వరుడు మాత్రం ఒకడే..!
ఒకే పందిట్లో అక్కాచెల్లెల్లిద్దరి పెళ్లి జరిగింది. ఇలాంటివి చాలానే జరుగుతాయి, అందులో వింతేముంది అంటారా..! ఆ ఇద్దరు వధువులను మనువాడే వరుడు ఒకడే కావటం ఇందులో విశేషం. మొదట అక్కతో పెళ్లి నిశ్చయమైంది. కట్ చేస్తే అందరి సమ్మతంతో ఇద్దరి మెడలో పెళ్లికొడుకు తాళి కట్టాడు. అలా ఎందుకు కట్టాడంటే...! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.