తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌ టెన్ న్యూస్ @ 1 PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

Top ten news till 1 PM
టాప్‌ టెన్ న్యూస్ @ 1 PM

By

Published : May 27, 2021, 12:57 PM IST

చర్చలు ఫలించేనా?

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీతో జూనియర్ వైద్యులు సమావేశమయ్యారు. బీఆర్‌కే భవన్‌లో రిజ్వీతో సమావేశమైన ఐదుగురు సభ్యుల బృందం చర్చిస్తోంది. జూడాలు తమ డిమాండ్లను రిజ్వీకి వివరిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు నిర్వహించిన చర్చలు విఫలం కాగా... ప్రస్తుత చర్చలు ఫలిస్తాయా.. లేదా..? అన్న ఆసక్తి నెలకొంది.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'కొత్త పార్టీ పరిష్కారం కాదు.. '

ఈటల రాజేందర్‌ వ్యవహారంలో సీఎం కేసీఆర్​ వైఖరి సరైంది కాదని తెజస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. మేడ్చల్​లోని ఈటల నివాసంలో కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​ భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై చర్చించినట్టు కోదండరాం తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

జాగ్రత్తగా ఉండటమే ఉత్తమం

కోఠిలోని ఈఎన్​టీ ఆస్పత్రిని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి సందర్శించారు. బ్లాక్​ఫంగస్​ వార్డులో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. వారికి అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

పదో తరగతి పరీక్షలు వాయిదా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదోతరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఈ పరీక్షలు నిర్ణయించే తేదీని ప్రకటించలేదు. జులైలో సమీక్ష నిర్వహించి పరీక్షలు తేదీని నిర్ణయించే అవకాశం ఉంది. వచ్చే జూన్​ 7 నుంచి 16 వ తేదీ వారకు ఆంధ్రప్రదేశ్​లో పదో తరగత పరీక్షలు నిర్వహించాలని ముందుగా ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'అతన్ని భారత్​కు అప్పగించండి!'

డొమినికాలో పట్టుబడ్డ.. పీఎన్​బీ కుంభకోణానికి పాల్పడిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని తిరిగి భారత్​కు అప్పగించాలని ఆ దేశాన్ని ఆంటిగ్వా ప్రధాన మంత్రి గాట్సన్ బ్రౌన్ కోరినట్లు తెలుస్తోంది. ఛోక్సీని పోలీసులు పట్టుకున్న మంగళవారం రోజే ఈ విషయాన్ని డొమినికాకు తెలిపినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

టీకాలు ఆపామన్నందుకు ఫైన్ ఎంతో తెలుసా..?

పూర్తిస్థాయిలో క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించకుండానే కొవిడ్ టీకాలను వినియోగిస్తున్నందున.. టీకా పంపిణీ ప్రక్రియను నిలిపివేయాలని దాఖలైన పిల్​ను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగానూ పిటిషన్​దారుకు రూ.50,000 జరిమానా విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఒకే కాలికి 9 వేళ్లు!

కర్ణాటకలోని హోసపేటలో వింత ఘటన జరిగింది. ఎడమకాలికి తొమ్మిదివేళ్లతో ఓ మగబిడ్డ జన్మించాడు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, నెలలు నిండిన అనంతరమే కాన్పు జరిగిందని వైద్యులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'ఆ చట్టాలను మేం గౌరవిస్తాం'

దేశంలో కేంద్రం-వాట్సప్ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇంటర్​నెట్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్స్పందించారు. ఆయా దేశాల్లోని శాసన ప్రక్రియను గూగుల్ గౌరవిస్తుందని స్పష్టం చేశారు. స్థానిక చట్టాలకు లోబడి.. ప్రభుత్వాలతో పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'భవిష్యత్ కెప్టెన్ అతనే'

టీమ్ఇండియా కెప్టెన్​ కోహ్లీ .. భవిష్యత్​లో సారథ్య బాధ్యతల్ని రోహిత్​ శర్మతో కలిసి పంచుకుంటాడని తాను భావిస్తున్నట్లు తెలిపాడు టీమ్​ఇండియా మాజీ వికెట్​కీపర్​ కిరణ్​ మోరె. ఒకవేళ ఇదే కనుక జరిగితే అది భవిష్యత్​ తరాలకు ఓ బలమైన సందేశం అవుతుందని చెప్పాడు. భారత్​ క్రికెట్​ మరింత బలంగా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

తారల తళుకులు తన్మయత్వమే!

హిరోయిన్ల అందాలు చూస్తే మైమరచిపోయేలా ఉంటాయి. విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న సినిమా తారల తళుకులు చూసేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details