- మరణ మృదంగం
రాష్ట్రంపై కరోనా రెండో దశ తీవ్రప్రభావం చూపిస్తోంది. వారం నుంచి రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కొవిడ్‌తో చికిత్స పొందుతూ అత్యధికంగా 33 మంది మృతిచెందారు. పది గంటల వ్యవధిలో పలు ఆసుపత్రుల్లో వెయ్యి మంది చేరగా...దాదాపుగా ఐసీయూ పడకలన్నీ బాధితులతో నిండిపోతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తెలంగాణకు రెమ్‌డెసివిర్
కేంద్ర సర్కార్ తెలంగాణకు అదనంగా 13,500 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తొలుత 21,500 కేటాయించగా.. ప్రస్తుతం ఆ సంఖ్యను 35వేలకు పెంచింది. అత్యధికంగా మహారాష్ట్రకు 4,35,000 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ఇవ్వనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కొవాగ్జిన్ ధర ఎంతంటే?
కొవాగ్జిన్ టీకా ధరలను భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. కేంద్రానికి రూ.150కు, రాష్ట్రాలకు రూ.600కు అమ్ముతామని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తగ్గుతున్న రక్తనిధి
కరోనా ప్రభావం రక్తనిధి కేంద్రాలపై పడింది. కేసులు పెరుగుతుండటం, దాతలు ముందుకు రాకపోవడంతో రక్త నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లోని ప్రధాన బ్లడ్ బ్యాంకుల్లో మే నెలలో 4,324 యూనిట్ల రక్తం అవసరం ఉండగా ప్రస్తుతం కేవలం 796 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు హైదరాబాద్‌లోని నారాయణగూడ ఐపీఎం కేంద్ర సిబ్బంది వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- గతంలోనే కేంద్రానికి హెచ్చరిక!
ప్రాణవాయువు ఉత్పత్తి పెంచాలని, భారీ స్థాయిలో నిల్వ చేయాలని కేంద్రానికి నవంబర్లోనే సూచనలు ఇచ్చింది పార్లమెంటరీ స్థాయీ సంఘం. ఆక్సిజన్ కొరత వల్ల ఏర్పడే ఇబ్బందుల గురించి గతంలోనే హెచ్చరించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అది ఫేక్‌న్యూస్!