ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు'ఇది మనకు పరీక్షాసమయం...!' CM KCR Review On Heavy Rains: రాష్ట్రంలో కురుస్తున్న వానలు, వరదలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మరో 2, 3రోజులు భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఇది పరీక్షా సమయమని.. కష్టకాలంలో ప్రజలను కాపాడేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు.రాష్ట్రంలో మరో 13 మండలాలురాష్ట్రంలో మరికొన్ని కొత్త మండలాలు రానున్నాయి. మరో 13 మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజా ఆకాంక్షలు, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ జిల్లాల్లో నూతన మండలాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.కేటీఆర్‌కు మూడు వారాల విశ్రాంతి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాలికి స్వల్ప గాయమైంది. గాయం మానేందుకు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రాజెక్టులకు పోటెత్తుతోన్న వరదగత మూడు, నాలుగు రోజులుగా కాస్త బ్రేక్ తీసుకున్న వాన దేవుడు.. మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కుండపోత వర్షాలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. భారీ వర్షాలతో రహదారులన్నీ చెరువులను తలపిస్తుండగా.. ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. మొన్నటి వరకు జలాశయాల ఉగ్రరూపం చూసిన అధికారులు అప్రమత్తం కాగా.. ముంపు బాధితులు మరింత ఆందోళన చెందుతున్నారు.'పక్షపాత రాజకీయాలు వద్దు.. గాంధేయవాదమే మేలు' Ramnath kovind farewell: పక్షపాత ధోరణికి అతీతంగా రాజకీయ పార్టీలు నడుచుకోవాలని సూచించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. రాష్ట్రపతిగా దేశానికి సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. పార్లమెంట్ సభ్యులతో కూడిన పెద్ద కుటుంబంలో తాను ఒక భాగమని.. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలని సూచించారు.ఆ టీవీ డిబేట్లపై సీజేఐ ఆందోళనCJI KANGAROO COURT: టీవీ ఛానెల్‌లలో చర్చలు, సామాజిక మాధ్యమాల్లో 'కంగారూ కోర్టు'ల నిర్వహణ దేశ ప్రజాస్వామ్యానికి హానికరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. మీడియా చర్చలు న్యాయవ్యవస్థ పనితీరు, స్వతంత్రతను ప్రభావితం చేస్తాయన్నారు. మీడియా వ్యక్తం చేస్తున్న పక్షపాత అభిప్రాయాలు, ప్రత్యేక ఎజెండాతో నడిచే చర్చలు భారత ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి వేసేలా చేస్తున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తంచేశారు.' రాహుల్.. దమ్ముంటే ఆ పని చెయ్' Smriti Irani daughter restaurant: అక్రమంగా బార్ నడుపుతున్నారంటూ తన కుమార్తెపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను స్మృతి ఇరానీ తీవ్రంగా ఖండించారు. రాహుల్, సోనియా అక్రమాలపై తాను మాట్లాడటం వల్లే ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే రాహుల్ గాంధీ తనపై మరోసారి పోటీ చేయాలని సవాల్ విసిరారు.ఆ బ్యాంకుల లాభాలు 50శాతం జంప్ICICI BANK Q1 result: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ.. త్రైమాసిక ఫలితాల్లో సత్తా చాటింది. నికర లాభం 50 శాతం వృద్ధి చెందినట్లు ప్రకటించింది. యెస్ బ్యాంక్ సైతం లాభాల్లో 50 శాతం వృద్ధి సాధించింది. మరో ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా సైతం ఫలితాల్లో రాణించింది.తొలిసారి గిరిజన మహిళకు జాతీయ అవార్డు గిరిజన మహిళలంటే సమాజంలో ఒక రకమైన చిన్నచూపు ఉంటుంది! వాళ్లు ఏదీ సాధించలేరన్న భ్రమలో ఉంటారు చాలామంది. కానీ కేరళకు చెందిన 62ఏళ్ల నాంజియమ్మ ఈ భావన తప్పని నిరూపించింది. తాజాగా ప్రకటించిన 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో పురస్కారాన్ని దక్కించుకుని.. దేశమంతటా తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ప్లే బ్యాక్ సింగింగ్‌లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గిరిజన మహిళగా నిలిచింది. ఆమె గురించే ఈ కథనం..ఇకపై అంపైర్లకు స్పెషల్ కేటగిరీBCCI Umpire: అంపైరింగ్‌లో సమర్ధవంతమైన తీరు ప్రదర్శించిన వారి కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేసింది. అందులో ఎవరెవరికి చోటు దక్కిందంటే..