తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Jul 26, 2022, 10:59 AM IST

  • 15వేల దిగువకు కరోనా కేసులు

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 14,830 మంది వైరస్ బారిన పడగా.. 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా భారీగా కేసులు నమోదయయ్యాయి. అత్యధికంగా జపాన్​లో ఒక్కరోజే 1.72 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు.

  • అర్ధరాత్రి వచ్చింది.. ఆగం చేసింది..!

Heavy Rain in Hyderabad : హైదరాబాద్​లో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాల్లోతు నీరు నిలిచింది. ఇప్పటికే చెరువులన్నీ దాదాపుగా నిండిపోవటం.. ఊహించని రీతిలో మళ్లీ వర్షం రావటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. కాలనీలు, అపార్ట్​మెంట్లు జలమయం కావటంతో.. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.

  • జంట జలాశయాలకు ఉద్ధృతంగా వరద

Twin Reservoirs : అర్ధరాత్రి అకస్మాత్తుగా కురిసిన వానకు భాగ్యనగరం అతలాకుతలమైంది. తెల్లవారి లేచి బయటకు వచ్చిన జనమంతా రోడ్లను చూసి షాకయ్యారు. చెరువులను తలపిస్తున్న రహదారులపై వెళ్లడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. హుస్సేన్​సాగర్​లో పూర్తిస్థాయి నీటిమట్టం దాటి వరద ప్రవాహం పోటెత్తుతోంది.

  • ‘కొంప’లు ముంచేంత నిర్లక్ష్యం

శివారు ప్రాంతాలనే అడ్డాలుగా చేసుకుని దొంగలు ముఠాలు తమ దోపిడీలను కొనసాగిస్తున్నాయి. భద్రతా సిబ్బంది.. సీసీ కెమెరాలు.. ఎన్ని ఉన్నా.. దొంగలు గురిపెడితే ఇవేమీ అడ్డుకావని పలు ఘటనలు నిరూపిస్తున్నాయి. రూ.1-2 కోట్లతో నిర్మించుకున్న భవన తలుపులకు సరైన తాళాలు లేకపోవడంతో దొంగలు సులువుగా లోపలకు చేరుతున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

  • వైఎస్‌ ఒక్కరి వద్దే కమీషన్లు తీసుకోలేదు

Sharmila Comments on YSR : తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​రెడ్డిపై వైతెపా అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్​లా.. వైఎస్​ ఒక్కరి వద్దే కమీషన్లు తీసుకోలేదని ఆరోపించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

  • ఆమెకు 53.. అతడికి 29.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

పెళ్లి చేసుకుంటానని నమ్మించి తైవాన్​కు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన హరియాణాలో జరిగింది. మరోవైపు, అరోగ్యం బాగాలేక క్లినిక్​కు వెళ్లిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నకిలీ వైద్యుడు. ఈ దారుణం రాజస్థాన్​లో జరిగింది.

  • పంది కోసం గ్యాంగ్​వార్

ఒక పంది కోసం నడిరోడ్డుపైన రచ్చ చేశారు కొందరు వ్యక్తులు. పందిని తరలిస్తున్న ఓ గ్యాంగ్​పై మరో మూక దాడి చేసింది. వాహనాన్ని కార్లతో ఢీకొట్టి కత్తులతో దాడికి దిగారు. రెండు గ్యాంగ్​ల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన గుజరాత్​లోని సురేంద్రనగర్​లో సోమవారం జరిగింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

  • కల్తీ మద్యం తాగి 22 మంది మృతి

కల్తీ మద్యం తాగిన కారణంగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గుజరాత్​లోని భావ్​నగర్​లో జరిగింది. మొత్తం 47 మంది ఈ ఆస్పత్రిలో చేరారు. ధందుక, భావ్​నగర్​, బోటాడ్​ జిల్లాలోని ఆస్పత్రుల్లో కల్తీ మద్యానికి బలవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • పోలీస్​స్టేషన్​లో అక్కాచెల్లెళ్ల వీరంగం

ఫోన్​ పోయిందని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఇద్దరు యువతులను మూడు గంటలు పాటు వేచి ఉంచారు పోలీసులు. దీంతో కోపంతో ఈ యువతులు మహిళా ఇన్​స్పెక్టర్​పై దాడికి దిగారు. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

  • పిల్లాడి వేలు విరిచేసిన రోబో

Robot Chess finger break : ఏడేళ్ల బాలుడితో చెస్​ ఆడుతున్న రోబో.. ఒక్కసారిగా ఆ పిల్లాడి వేలు విరిచేసింది. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారు ఖంగుతిన్నారు. రోబో చెర నుంచి బాలుడ్ని విడిపించారు.

ABOUT THE AUTHOR

...view details