తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్‌న్యూస్‌ @ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Jun 22, 2022, 12:59 PM IST

  • మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..

బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,390గా ఉంది. కిలో వెండి ధర రూ.62,024గా ఉంది.

  • 'దేశ రక్షణ వ్యవస్థలో కీలకంగా హైదరాబాద్'

పర్యావరణానికి అనుకూలంగా పరిశ్రమలు రావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు పెరగాలని అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్‌లో వెమ్ టెక్నాలజీస్ పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేశారు.

  • 'ధనిక రాష్ట్రం.. ఉద్యోగులకు జీతాలివ్వలేని ప్రభుత్వం'

ధనిక రాష్ట్రమైన తెలంగాణ... తెరాస పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్ధితికి చేరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. విదేశీ యాత్రలకు వందల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం... నెల జీతం వస్తేకాని పూట గడవని హోం గార్డుల కుటుంబాల పరిస్థితి గురించి ఒక్కసారైనా ఆలోచించిందా అని ప్రశ్నించారు.

  • జహీరాబాద్‌లో నిమ్జ్ నిర్వాసితుల ఆందోళన..

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నిమ్జ్‌లో వెమ్ టెక్నాలజీస్‌కు శంకుస్థాపన చేయడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెళ్తున్న నేపథ్యంలో నిమ్జ్‌ భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. తమకు పరిహారం చెల్లించకుండా నిర్మాణాలు ఎలా చేస్తారని మండిపడ్డారు.

  • 'అతి త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్'

భూనిర్వాసితులను రెచ్చగొట్టి ఎన్ని అడ్డంకులు సృష్టించినా... అతి త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ చేసి తీరుతామని ఎమ్మెల్యే సతీష్ కుమార్ పునరుద్ఘాటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో... లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

  • కంకిపాడులో క్యాసినో..

ఏపీలోని గుడివాడలో నిర్వహించిన ‘గోవా క్యాసినో’ వ్యవహారం మరువక ముందే కృష్ణా జిల్లాలో మరో ఈవెంట్‌కు పెద్దలు రంగం సిద్ధం చేశారు. గోవా కల్చర్‌తో క్యాసినో.. మందు పార్టీలు, సినీ తారల డ్యాన్సులు, విందులు.. ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్నారు.

  • పెళ్లి వేడుకలో మిస్​ఫైర్​..

వైభవంగా జరుగుతున్న ఆ వివాహ వేడుకలో ఆనందంతో కొందరు జరిపిన కాల్పులు విషాదానికి దారితీశాయి. అవి మిస్​ఫైర్​ అవ్వడం వల్ల ఓ ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని సోన్​భద్రలో జరిగింది.

  • మహిళ సజీవ దహనానికి విఫలయత్నం..

ఆధునికత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. మనిషి మూఢ నమ్మకాలను వీడట్లేదనడానికి నిదర్శనమే ఈ ఘటన. ఓ మహిళను తాంత్రికురాలని నిందిస్తూ ఆమెను సజీవ దహనం చేసేందుకు యత్నించారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్​లోని అజ్మీర్​లో జరిగింది.

  • భారీ భూకంపం.. 255 మంది మృతి!

అఫ్గానిస్థాన్​లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు అప్గానిస్థాన్​లోని పక్టికా ప్రావిన్స్​ సమీపంలో జరిగిన ఈ ఘటనలో 255 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా సంస్థ బఖ్తర్​ వెల్లడించింది. రిక్టర్​ స్కేల్​పై భూకంప తీవ్రత 6గా నమోదైనట్లు పేర్కొంది.

  • విజయ్​ 'వారిసు' సెకండ్​ లుక్​..

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో విజయ్​ 'వారిసు' సెకండ్​ లుక్​, పంజా వైష్ణవ్​ తేజ్​ కొత్త చిత్రం ప్రకటన వివరాలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details