తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్- ముఖ్యాంశాలు

Telangana top news today
ఈటీవీ భారత్- ముఖ్యాంశాలు

By

Published : Dec 16, 2021, 5:46 AM IST

Updated : Dec 16, 2021, 10:00 PM IST

21:51 December 16

టాప్​ న్యూస్​ @10PM

  • 'ఒమిక్రాన్​ను నిలువరించాలి లేదంటే మూడో ముప్పు తప్పదు'

Doctor Sridhar on Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడం ప్రమాదకరమేనన్నారు కొవిడ్‌-19 పరిశోధకులు డాక్టర్‌ శ్రీధర్‌ చిలిమూరి. ఈసారి ముందుగానే ఒమిక్రాన్​ను నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 55 దేశాల్లో ఉనికిని చాటుకుంది. రెండు డోసులు తీసుకున్నవారికి ముప్పు తక్కువేనని చెప్పారు. మరో వేవ్ రావడానికి అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.

  • 'కరోనా మ్యుటేషన్ల వల్లే యాంటీబాడీలూ పని చేయటం లేదు'

Corona mutations: ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కొవిడ్-19 పరిశోధకులు డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఏ మాత్రం అలసత్వం వహించినా.. మూడో ముప్పు తప్పదని అంటున్నారు. వ్యాక్సిన్​లకు లొంగకుండా ఒమిక్రాన్ ఎలా విస్తరిస్తుందో వివరించారు. అమెరికాలో బూస్టర్ డోస్ అందిస్తున్నారని... ఇండియాలో ఇంకా స్పష్టతనివ్వలేదని పేర్కొన్నారు.

  • రాజకీయాలకు మెట్రోమ్యాన్​ గుడ్​బై

Metroman quits politics: మెట్రోమ్యాన్ శ్రీధరన్​.. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. 90ఏళ్ల వయసులో రాజకీయాల్లో కొనసాగడం ప్రమాదకరమన్నారు.

  • 'భారత క్రికెట్‌కు వివాదాలు అంత మంచిది కాదు'

Kapil Dev On Kohli Captaincy: వివాదాలు భారత క్రికెట్‌కు అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు క్రికెట్ దిగ్గజ కపిల్ దేవ్​. దక్షిణాఫ్రికా లాంటి కీలక విదేశీ పర్యటనలకు ముందు ఇలా వాదులాడుకుంటే ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపిస్తుందని అన్నారు.

  • ఆర్​ఆర్​ఆర్​ కొత్త స్టిల్స్​ వచ్చేశాయి..

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్ఆర్ఆర్, పెళ్లి సందD, గంగూబాయ్ కతియవాడి, మధురవైన్స్, అంతఃపురం చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

21:04 December 16

టాప్​ న్యూస్​ @9PM

  • మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు

రాష్ట్రంలో మరో నాలుగు ఒమిక్రాన్​ పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 7కు చేరింది.

  • దిల్లీలో 10 ఒమిక్రాన్ కేసులు

Omicron India: దిల్లీలో ఇప్పటివరకు 10 మందికి ఒమిక్రాన్​ వేరియంట్​ సోకినట్లు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ ప్రబలుతోంది. ఇండోనేసియాకు కూడా ఈ వేరియంట్ వ్యాపించింది.

  • ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల

Intermediate results: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కేవలం 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 59 వేల 242 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు.

  • ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ చిన్నారి

Borewell Baby Rescue Operation: మధ్యప్రదేశ్​లోని ఛత్తర్​పుర్​ జిల్లా దౌనీ గ్రామంలో ఓ ఏడాదిన్నర చిన్నారి బోరుబావిలో చిక్కుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

  • చైనాకు అమెరికా మరో ఝలక్

US sanctions on China: చైనాపై కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆ దేశంలో ఉయ్​ఘర్లపై మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అందుకే పలు సంస్థలు లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పింది.

19:52 December 16

టాప్​ న్యూస్​ @8PM

  • 'వాళ్లను పాస్​ చెయ్యండి.. లేదంటే మరోసారి పరీక్షలు పెట్టండి'

parents on inter results: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత తగ్గడంపై తెలంగాణ తల్లిదండ్రుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఫెయిలైన విద్యార్థులకు కనీస మార్కులు వేసి ఉత్తీర్ణులను చేయాలని తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్.పద్మారెడ్డి డిమాండ్ చేశారు.

  • సింహం మాస్క్​తో ఎంట్రీ.. సీసీటీవీలపై స్ప్రే.. నిమిషాల్లో కోట్లు దోపిడీ!

తమిళనాడు వేలూర్​లో దొంగలు బీభత్సం సృష్టించారు. వెనుకవైపు గోడకు పెద్ద రంధ్రం చేసి జోస్​ అలుకాస్​ జువెలరీ షాప్​లోకి ప్రవేశించారు. 15 కేజీల బంగారం, రూ. 8 కోట్ల విలువైన డైమండ్​ దోచుకెళ్లారు. చోరీ బుధవారం జరగగా.. గురువారం సీసీటీవీ దృశ్యాలను విడుదల చేశారు పోలీసులు. సింహం ఆకారం మాస్క్​ ధరించిన ఓ దుండగుడు.. సీసీటీవీలపై స్ప్రే చేయడం గమనార్హం.

  • అమ్మడం కోసమే పిల్లల్ని కన్న తండ్రి

Chinese man sold his children: ఐదుగురు పిల్లలను రూ.లక్షలకు విక్రయించిన ఓ తండ్రికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది చైనా కోర్టు. కేవలం డబ్బు ఆశతో లాభాపేక్ష కోసమే ఈ దంపతులు పిల్లల్ని కన్నట్లు తెలిపింది. పసికందులను పెంచి పెద్ద చేయాల్సిన సొంత తల్లిదండ్రులే ఇలా చేయడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించింది.

  • దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన టీమ్​ఇండియా

IND vs SA 2021:టెస్టు, వన్డే సిరీస్​ల నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో టీమ్​ఇండియా అడుగుపెట్టింది. బీసీసీఐ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

  • 'బాలీవుడ్​లో చాలా ఆఫర్స్ వచ్చాయి'

హిందీలో నేరుగా సినిమా చేయడంపై అగ్రకథానాయకుడు అల్లు అర్జున్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. అది తన కెరీర్​లోనే ల్యాండ్​మార్క్​ చిత్రమయ్యేలా ప్లాన్ చేస్తున్నానని అన్నారు.

18:52 December 16

టాప్​ న్యూస్​ @7PM

  • ఏకంగా బెయిల్​ పత్రాలే సృష్టించారు..

fake bail documents gang : కరెన్సీ నకిలీ నోట్లు, ఆస్తి పత్రాలు, ఇతర డ్యాక్యుమెంట్లు తయారు చేస్తున్న ముఠాల గురించి తెలిసిందే.. కానీ ఈ ముఠా ఏకంగా న్యాయవ్యవస్థనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఏకంగా కోర్టు ఇచ్చినట్లుగా నకిలీ బెయిల్​ పత్రాలు సృష్టించారు. చివరికి అడ్డంగా దొరికిపోయి కటకటాలపాలయ్యారు. ఈ ఘటన వరంగల్​లో జరిగింది.

  • 'కొద్దిరోజులు కలిసుంటే సహజీవనం కాదు'

Live in relationship: సహజీవనంపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అమ్మాయి, అబ్బాయి కొద్ది రోజులు కలిసున్నంత మాత్రాన సహజీవనంగా భావించలేమని చెప్పింది. తమ పెద్దల నుంచి రక్షణ కల్పించాలి పిటిషన్ దాఖలు చేసిన ఓ ప్రేమజంటకు రూ.25వేల జరిమానా విధించింది.

  • పాలపొడి ప్యాకెట్లలో డ్రగ్స్​

Bangalore Drugs News: మిల్క్​పౌడర్​ ప్యాకెట్ల ద్వారా డ్రగ్స్​ పంపిణీ చేస్తున్న ఓ నైజీరియన్​ను అరెస్ట్​ చేశారు బెంగళూరు పోలీసులు. మరోవైపు గంజాయి విక్రయిస్తున్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి నుంచి 8కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

  • మరింత కాలం వర్క్ ఫ్రమ్ హోమ్- ఒక్కో ఉద్యోగికి రూ.75వేలు బోనస్!

Work From Home: ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ హోమ్​ అవకాశాన్ని పొడగిస్తున్నట్లు ప్రకటించింది యాపిల్​ సంస్థ. దీంతో పాటు ప్రతి ఉద్యోగికి రూ.76,131 బోనస్​గా ఇస్తున్నట్లు పేర్కొంది.

  • ట్విస్టులతో 'మా ఊరి పొలిమేర'

Movie review: మూడనమ్మకాల అంశానికి థ్రిల్లర్​ కథను జోడించి తీసిన సినిమా 'మా ఊరి పొలిమేర'. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఎందులో చూడొచ్చు? తదితర విషయాలు తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

18:00 December 16

టాప్​ న్యూస్​ @6PM

  • గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ కుటుంబానికి రూ.కోటి సాయం, ఉద్యోగం

Varun Singh Captain: తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​.. భౌతిక కాయం భోపాల్​లోని ఆయన స్వగృహానికి చేరుకుంది. అంతకుముందు విమానాశ్రయంలో ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు ఐఏఎఫ్​ అధికారులు, మధ్యప్రదేశ్​ మంత్రులు. వరుణ్​ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి సాయం ప్రకటించింది.

  • బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా సర్కారు ఉత్తర్వులు

Child Labour Act: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా రాష్ట్ర సర్కారు కృషి చేస్తోంది. కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో బాలకార్మిక చట్టాన్ని సవరిస్తూ విధివిధానాలు ఖరారు చేస్తూ కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 14 ఏళ్ల లోపు చిన్నారులతో ఎవరైనా, ఎక్కడైనా పనిచేయించుకుంటే కఠిన చర్యలు తీసుకోనున్నారు.

  • 'ఓవైసీ ప్రధాని కావాలంటే.. మీరంతా ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సిందే!'

AIMIM party in up: అసదుద్దీన్​ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీకి చెందిన ఓ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓవైసీని ప్రధానిగా చూడాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ముస్లింలకు ఉచిత సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

  • కోహ్లీ వివాదంపై గంగూలీ ఏమన్నాడంటే?

Sourav Ganguly VS Virat Kohli: టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ నిరాకరించాడు. ఈ విషయాన్ని క్రికెట్​ బీసీసీఐ డీల్​ చేస్తుందని స్పష్టం చేశాడు.

  • 'పుష్ప' సినిమా.. ఈ విషయాలు గమనించారా?

Pushpa movie release: ''పుష్ప'.. పుష్పరాజ్ తగ్గేదే లే' అంటూ బన్నీ ఫ్యాన్స్​ గోల గోల చేస్తున్నారు. మరోవైపు పాన్ ఇండియా రేంజ్​లో రిలీజ్​ అవుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. మరి ఇంతలా క్రేజ్​ తెచ్చుకున్న 'పుష్ప' సినిమాలోని కొన్ని విషయాలు తెగ ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?

16:53 December 16

టాప్​ న్యూస్​ @5PM

  • శిల్పకు బెయిల్​

Shilpa Chowdary Bail: పెట్టుబడుల పేరుతో పలువురిని మోసం చేసిన కేసులో అరెస్టయిన శిల్పాచౌదరికి బెయిల్​ మంజూరు అయింది. ఉప్పర్​పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పలువురిని మోసం చేసిన కేసులో శిల్పాచౌదరి అరెస్టయిన సంగతి తెలిసిందే. రూ.7 కోట్ల మేర మోసం చేసిందని శిల్పపై ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేశారు.

  • 'ఆ ఘనత సీఎం కేసీఆర్​దే'

Minister KTR in sangareddy: ఇల్లు లేని పేదలు ఎక్కెడైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని ఉంటే వారికి ఆ స్థలాలను రెగ్యులరైజ్​ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కేటీఆర్​ తెలిపారు. సఫాయి కార్మికులకు జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్​దేనని ఆయన అన్నారు. పట్టణ ప్రగతి ద్వారా రాష్ట్రంలోని పురపాలికలకు రూ.3041 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు చేసిందని మంత్రి స్పష్టం చేశారు.

  • 'ఆ భయంతోనే ఇందిరను విస్మరించారు'

Rahul Gandhi rally in Dehradun: 1971 యుద్ధంలో విజయం సాధించటంపై గురువారం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్రంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. నిజానిజాలకు భయపడే ఇందిరా గాంధీని విస్మరించారని ఆరోపించారు. ఉత్తరాఖండ్​లోని చాలా కుటుంబాల మాదిరిగానే తన కుటుంబం సైతం త్యాగాలు చేసిందని పేర్కొన్నారు.

  • ఈదురు గాలులకు ఐదుగురు పిల్లలు బలి

Bouncy Castle: బౌన్సీ క్యాజిల్​పై ఆడుకుంటుండగా విషాదం జరిగింది. అభంశుభం ఎరగని ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈదురుగాలులతో క్యాజిల్​ పైకి ఎగరగా.. పిల్లలు కింద పడినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని టాస్మేనియాలో ఈ ఘటన జరిగింది.

  • ''పుష్ప' కాదు మన సినిమా గెలవాలి'

Pushpa Press meet: ప్రేక్షకులు మళ్లీ ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు రావాలని, అలానే సినిమా గెలవాలని ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్ అన్నారు. ముంబయిలో ప్రెస్​మీట్​లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

15:49 December 16

టాప్​ న్యూస్​ @4PM

  • ఇంటర్​ ఫలితాలు విడుదల

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలను ఇంటర్​ బోర్డు విడుదల చేసింది. మొదటి సంవత్సరంలో 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షల్లో 56 శాతం బాలికలు, 42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 2,24,012 మంది ఉత్తీర్ణత సాధించారు.

  • 'పుష్ప' చిత్రానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి

'పుష్ప' చిత్రానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఐదో ఆటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

  • నిరసనలతో దద్దరిల్లిన పార్లమెంట్

Parliament winter session: లఖింపుర్​ ఖేరి ఘటనపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్​ అట్టుడికింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్​తో నిరసనలతో హోరెత్తించారు విపక్ష సభ్యులు. దీంతో ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే శుక్రవారానికి వాయిదా పడ్డాయి.

  • యూపీలో మోదీ సుడిగాలి పర్యటనలు

Modi UP Visit: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్​ప్రదేశ్​లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవలే కాశీ విశ్వనాథ్​ నడవా ప్రారంభోత్సవం కోసం అక్కడికి వెళ్లిన ప్రధాని.. వచ్చే 10 రోజుల్లో మరో నాలుగు సార్లు యూపీ వెళ్లనున్నారు.

  • సెన్సెక్స్​ 110 ప్లస్​

Stock Market: వరుసగా నాలుగు సెషన్ల పతనం అనంతరం భారత స్టాక్​ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 57 వేల 900 ఎగువకు చేరింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగింది.

14:36 December 16

టాప్​ న్యూస్​ @3PM

  • ఒమిక్రాన్​ ఎఫెక్ట్​

Omicron cases in Telangana: రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసుల నమోదుతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇటీవల కెన్యా, సోమాలియా దేశాల నుంచి హైదరాబాద్​కు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్​ పాజిటివ్​ నిర్ధరణ కావడంతో.. బాధితులను చికిత్స నిమిత్తం టిమ్స్​ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు హైదరాబాద్​లోని పారామౌంట్​ కాలనీని కంటైన్మెంట్​ జోన్​గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ కాలనీలో కరోనా ఆంక్షలు విధిస్తూ.. 25 ఇళ్ల పరిధిలో కంటైన్మెంట్​ జోన్​ ఏర్పాటు చేసింది.

  • 'యుద్ధ విమానాల పవర్'​లో భారత్ ర్యాంక్​ @ 4

Indian military aircraft fleet: దేశంలో 700 యుద్ధ విమానాలు, 253 రవాణా విమానాలు, 805 యుద్ధ హెలికాప్టర్లు యాక్టివ్​గా ఉన్నాయి. దీంతో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద యాక్టివ్​ మిలిటరీ ఎయిర్​క్రాప్ట్​ ఫ్లీట్​ ఉన్న దేశంగా భారత్​ నిలిచింది. తొలి స్థానంలో అమెరికా కొనసాగుతోంది.

  • 'భాజపా ఆదేశిస్తే చాలు.. కేసీఆర్‌పై పోటీ చేస్తా'

Etela Rajender Latest Press Meet: తెరాస ప్రభుత్వం తన ఓటమి కోసమే హుజూరాబాద్​లో రూ.600 కోట్ల నల్లధనం ఖర్చుచేసిందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రజలు మాత్రం డబ్బుకు లొంగకుండా.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించారన్నారు. దళితబంధు ఓట్లకోసమే తీసుకువచ్చారని.. ప్రజల మీద ప్రేమతో తీసుకురాలేదని ఈటల తెలిపారు.

  • అత్యాచారం ఆరోపణలతో మంత్రి రాజీనామా

Goa Minister Resigns: అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పదవికి రాజీనామా చేశారు గోవా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మిలింద్​ నాయక్​. మరోవైపు ఎమ్మెల్యే అలీనా సల్దాన్హా కూడా ఎమ్మెల్యేగా, భాజపా సభ్యురాలిగా తప్పుకున్నారు.

  • కోహ్లీ x గంగూలీ.. ఇంత వివాదం ఎందుకు?

Kohli Ganguly Controversy: విరాట్‌ కోహ్లీ.. భారత జట్టులో ఇప్పటివరకు ఎదురులేని సారథి. తన ఆటతో, వ్యూహ పటిమతో జట్టును ముందుండి నడిపించిన మేటి క్రికెటర్‌. ఫార్మాట్లకు అతీతంగా వరుసగా సిరీస్‌లు గెలుస్తూ టీమ్‌ ఇండియాను బలమైన జట్టుగా తీర్చిదిద్దాడు. ఫలితంగా తనకెవరూ సాటిరాని విధంగా ఎదిగిపోయాడు. కానీ, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవనే సత్యం అందరికీ తెలిసిందే. కోహ్లీ విషయంలో ఇప్పుడు అచ్చం అదే జరిగింది. కెప్టెన్​గా ఎంత మంచి రికార్డున్నా.. ఎన్ని గొప్ప విజయాలు నమోదు చేసినా.. ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా సాధించలేదనే అపవాదును మోయాల్సి వచ్చింది.

14:14 December 16

టాప్​టెన్​ ​న్యూస్​ @2PM

  • రూ.600కోట్లు ఖర్చు చేశారు

Etela Rajender Latest Press Meet: తెరాస ప్రభుత్వం తన ఓటమి కోసమే హుజూరాబాద్​లో రూ.600 కోట్ల నల్లధనం ఖర్చుచేసిందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రజలు మాత్రం డబ్బుకు లొంగకుండా.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించారన్నారు. దళితబంధు ఓట్లకోసమే తీసుకువచ్చారని.. ప్రజల మీద ప్రేమతో తీసుకురాలేదని ఈటల తెలిపారు.

  • ఒమిక్రాన్​ వ్యాప్తి 70రెట్లు ఎక్కువ

Omicron variant news latest: డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్​ వేరియంట్​.. పూర్తి భిన్నమైనదని తాజా అధ్యయనంలో తేలింది. శరీరంలోకి గాలి ప్రవేశించే మార్గాల ద్వారా ఒమిక్రాన్‌ వేరియంట్.. డెల్టా కంటే 70 రెట్లు వేగంగా చొచ్చుకెళుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే.. శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఊపిరితిత్తుల కణజాలాల్లోకి చేరడంలో మాత్రం ఒమిక్రాన్‌.. కరోనా అసలు వేరియంట్‌తో పోలిస్తే 10 రెట్లు నెమ్మదిగా పయనిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

  • హెచ్​ఏఎల్​, బీఈఎల్​ మధ్య​ రూ.2,400 కోట్ల డీల్

HAL BEL deal: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌​, భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. తేజస్ ఎంకే1ఏ ప్రోగ్రామ్ కోసం 20 రకాల వ్యవస్థల అభివృద్ధి, సరఫరా కోసం ఉద్దేశించిన రూ.2,400 కోట్ల ఒప్పందంపై అధికారులు సంతకం చేశారు. మరోవైపు, దిగుమతి నిషేధం విధించిన రక్షణ పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్లు ఇవ్వనుంది కేంద్రం.

  • బ్యాంకులు బంద్- ఆ లావాదేవీలపై ప్రభావం

Bank Strike News: ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగారు. రెండు రోజుల పాటు సాగే ఈ బంద్ బ్యాంక్​ కార్యకలాపాలపై ప్రభావం చూపనుంది.

  • 'పుష్ప' టీమ్​కు చిరంజీవి స్పెషల్​ విషెస్​

12:43 December 16

టాప్​టెన్​ ​న్యూస్​ @1PM

  • పార్లమెంట్​లో లఖింపుర్​ రగడ

Parliament winter session: లఖింపుర్ ఘటనపై పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని సిట్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో.. కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డాయి.

  • వరంగల్‌ ఐటీ మరింత బలోపేతం

KTR on Warangal Tech Center: వరంగల్‌లో టెక్‌ సెంటర్ ఏర్పాటుకు జెన్‌పాక్ట్ సంస్థ ముందుకు వచ్చింది. జెన్‌పాక్ట్ రాకతో వరంగల్‌ ఐటీ మరింత బలోపేతం అవుతుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్​ చేశారు.

  • యాసంగి సాగుపై కొరవడిన స్పష్టత

రాష్ట్రంలో యాసంగి పంటలపై స్పష్టత కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా కర్షకులకు సంస్థాగత రుణాలు అందకపోగా... రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి నిర్దేశించిన లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో ఈ సీజన్‌లో ఇంకా ఇవ్వాల్సిన పంట రుణాలు 17 వేల కోట్లు మిగిలేఉన్నాయి. యాసంగి పంటలపై అనిశ్చితి నెలకొనడంతో రైతులు ముందుకు రావడంలేదని బ్యాంకర్లు చెబుతున్నారు.

  • హోంశాఖ కార్యాలయానికి అజయ్ మిశ్ర

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర.. ఆ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, రాజీనామా కోసం విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో.. ఆయన అక్కడికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • రాధేశ్యామ్ 'సంచారి' సాంగ్​ రిలీజ్​

'రాధేశ్యామ్' నుంచి మరో సాంగ్​ రిలీజ్​ అయింది. 'సంచారి' అంటూ సాగే ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. ఇందులో విజువల్స్​ చాలా రిచ్​గా ఉన్నాయి. ప్రభాస్​.. లవర్​బాయ్​గా, లైఫ్​ ఎంజాయ్​ చేస్తున్నట్లు కనిపించారు. పాటలో లొకేషన్స్​ ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సన్నివేశాల్లో డార్లింగ్​ స్టంట్లు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు కూడా అభిమానులను విపరీతంగా ఉర్రూతలూగించాయి.

12:00 December 16

టాప్​టెన్​ ​న్యూస్​ @12PM

  • బ్యాంకుల్లో నిలిచిన సేవలు

Banks Strike Today : ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యోగులు తలపెట్టిన సమ్మె రాష్ట్రంలోనూ కొనసాగుతోంది. ఇవాళ, రేపు రెండు రోజులపాటు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. నేడు రాష్ట్రమంతా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోయాయి. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులూ నిరసనలో పాల్గొంటున్నారు. బ్యాంకింగ్‌ చట్ట సవరణ ఆపాలని నినాదాలు చేస్తూ ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు.

  • అమర వీరులకు ప్రధాని నివాళి

Vijay Diwas 2021: 1971 యుద్ధంలో భారత్​ విజయం సాధించి 50 ఏళ్లు నిండిన సందర్భంగా దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. నాటి పోరాట వీరులు, అమర జవాన్ల సేవలను స్మరించుకున్నారు.

  • వరుణ్​ సింగ్​కు ఐఏఎఫ్​ నివాళి

captain varun singh: తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ భౌతకకాయానికి.. కర్ణాటక బెంగళూరులోని యెలహంక ఎయిర్​ ఫోర్స్​ బేస్​లో ఐఏఎఫ్​ నివాళులర్పించింది.

  • బంగ్లాదేశ్ విజయ్ దివస్​లో కోవింద్

Ramnath kovind in Bangladesh: పాకిస్థాన్​తో 1971లో జరిగిన యుద్ధంలో విజయానికి 50 వసంతాలు పూర్తైన నేపథ్యంలో బంగ్లాదేశ్​లో నిర్వహించిన విజయ్ దివస్ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఢాకాలో నిర్వహించిన నేషనల్ పరేడ్​ను వీక్షించారు.

  • వన్డే కెప్టెన్సీ వివాదం..

Kohli BCCI: టీమ్​ఇండియా వన్డే కెప్టెన్సీ వివాదంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పిన దానికి.. కోహ్లీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు పొంతన లేదని అన్నాడు. ఈ వివాదానికి తెరపడాలంటే వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి.. ఎక్కడ తప్పు జరిగిందో వివరించాలని చెప్పాడు.

11:03 December 16

టాప్​టెన్​ ​న్యూస్​ @11AM

  • సీబీఐ ఏజెంట్ల ముఠా దొరికేసింది

నకిలీ సీబీఐ ఏజెంట్ల ముఠాను ఏపీలోని రాజేంద్రవరంలో.. హైదరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 13న గచ్చిబౌలిలో జయభేరి ఆరెంజ్​ కౌంటిలోని సి-బ్లాక్​లోని అపార్టుమెంట్‌లోని స్థిరాస్తి వ్యాపారి వెంకటసుబ్రహ్మణ్యం ఇంట్లోకి ఆగంతకులు ప్రవేశించారు. సీబీఐ అధికారులమంటూ అక్కడున్నవారికి చెప్పారు. అనంతరం ఇల్లంతా సోదాలు చేయాలంటూ నిందితులు హడావిడి చేసి.. కిలోకు పైగా బంగారం, రూ.2 లక్షల నగదుతో ఉడాయించారు.

  • వివాహ వయసు.. 21ఏళ్లకు పెంపు!

Marriage age for female: అమ్మాయిల వివాహ వయసు పెంపునకు మరో అడుగు పడినట్లు సమాచారం. కనీస వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21కి పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వివాహ వయసు విషయంలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య తేడా తొలగించాలన్న అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • కుప్పకూలిన మినీ విమానం

Dominican republic plane crash: డొమినికన్​ రిపబ్లిక్​లోని శాంటో డొమింగోలో ఓ విమానం కుప్పకూలి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ప్రముఖ సంగీత దర్శకుడు జోస్ ఏంజెల్ హెర్నాండెజ్‌ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

  • 'లైగర్' రిలీజ్​ డేట్​ ఫిక్స్​​

Liger Movie Release date: విజయ్​ దేవరకొండ హీరోగా దర్శకుడు పూరీజగన్నాథ్​ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'లైగర్'​. తాజాగా ఈ మూవీ రిలీజ్​ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

  • 'ఈ ఏడాది బెస్ట్​ టాలీవుడ్ ఫిల్మ్​'

Pushpa First Review: సుకుమార్​ దర్శకత్వంలో అల్లుఅర్జున్​ హీరోగా తెరకెక్కిన 'పుష్ప' చిత్రం అద్భుతంగా ఉందని కొనియాడారు సినీవిశ్లేషకుడు ఉమైర్​ సంధు. ఈ ఏడాది ఉత్తమ టాలీవుడ్​ చిత్రంగా 'పుష్ప' నిలుస్తుందని జోస్యం చెప్పారు.

09:51 December 16

టాప్​టెన్​ ​న్యూస్​ @10AM

  • మరోసారి 8వేల దిగువకు కేసులు

India covid cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతోంది. కొత్తగా 7,974 కేసులు నమోదయ్యాయి. మరో 343 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 7,948 మంది కోలుకున్నారు.

  • అంతర్జాతీయ పోటీల్లో భారత్​ సత్తా

Gold Medals for India : శ్రీలంకలో జరుగుతున్న అంతర్జాతీయ ఛాంపియన్​షిప్​ పోటీల్లో తెలంగాణ వాసి భారత్​కు రెండు బంగారు పతకాలు సాధించారు. నల్గొండ జిల్లాకు చెందిన భాస్కర్ రెడ్డి పరుగు పందెం, షాట్​పుట్ క్రీడల్లో దేశానికి గోల్డ్​మెడల్ తీసుకొచ్చారు.

  • భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

stock-market-live-updates: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల పవనాలతో.. దేశీయ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ మరోసారి 58వేల మార్క్​ను దాటింది.

  • విండీస్​​ జట్టులో మరో ఐదుగురికి కరోనా

Westindies Cricketers Corona: పాకిస్థాన్​ పర్యటనలో ఉన్న వెస్టిండీస్​ జట్టులో మరో ముగ్గురు క్రికెటర్లు సహా ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా సోకింది. ప్రస్తుతం వారిని ఐసోలేషన్​కు పంపించారు. దీంతో కరోనా బారిన పడిన విండీస్ క్రికెటర్ల సంఖ్య ఆరుకు చేరింది.

  • ప్రభాస్​తో తొలిరోజు షూటింగ్​ అలా

Deepika Padukone Prabhas Movie: ఇటీవల 'ప్రాజెక్ట్​ కె' షూటింగ్​ తొలి షెడ్యూల్​ పూర్తి చేసుకుని ముంబయి తిరిగి వెళ్లిన బాలీవుడ్​ హీరోయిన్​ దీపికా పదుకొణె.. ప్రభాస్​తో పనిచేయడం గురించి మాట్లాడింది. డార్లింగ్​ సెట్స్​లో ఎంతో ప్రశాంతంగా ఉంటారని చెప్పింది. ఇంకా ఏం చెప్పిందంటే?

08:43 December 16

టాప్​టెన్​ ​న్యూస్​ @9AM

  • డెల్టా కంటే ఒమిక్రాన్ డేంజర్

Omicron doubling time: ఒమిక్రాన్ వేరియంట్ డబ్లింగ్ రేటు రెండు రోజులుగా ఉందని అమెరికా సీడీసీ డైరెక్టర్ రొషెల్ వాలెన్స్కీ వెల్లడించారు. ఇప్పటికే 75 దేశాల్లో వైరస్ కేసులు బయటపడ్డాయని తెలిపారు. అయితే, దేశంలో లాక్​డౌన్ విధించాల్సిన అవసరం లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది.

  • భారతీయులకు బిరుదులు ఎరగా వేసి

Azadi ka Amrit Mahotsav: సామదానభేద దండోపాయాలతో భారతీయులను లోబరచుకున్న బ్రిటిష్‌ రాజ్‌ మంత్రాంగంలోని ఒక మాయాపాశం... బిరుదులు.. పతకాలు, ప్రశంసలు! సంస్థానాధీశులు, సమాజంలోని ఉన్నత వర్గాలవారిని జాతీయోద్యమం వైపు వెళ్లకుండా... తమవైపు తిప్పుకోవటానికి ఆంగ్లేయులు ఈ గాలం వేసేవారు. గాంధీజీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌లాంటివారు కూడా దానికి చిక్కుకున్నా... త్వరలోనే కళ్లు తెరిచి వాపస్‌ ఇచ్చేశారు.

  • 'ఒమిక్రాన్'​తో పెను విధ్వంసం!'

Europe Omicron: 2022 జనవరి మధ్యనాటికి ఐరోపాలో కరోనా ఒమిక్రాన్​ వేరియంట్ అత్యంత ప్రధానమైన వేరియంట్​గా మారుతుందని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లెయన్‌ అంచనా వేశారు. అయితే.. ఈ వేరియంట్​ కలిగించే ముప్పును ఎదుర్కొనేందుకు ఐరోపా సంసిద్ధంగా ఉందని తెలిపారు. మరోవైపు.. కంబోడియా, ఫిలిప్పీన్స్​లో 'ఒమిక్రాన్' తొలి కేసులు వెలుగు చూశాయి.

  • అంతరిక్ష విపణి.. అపార అవకాశాల గని!

అంతరిక్ష శాస్త్ర సాంకేతికతల అభివృద్ధిలో పూర్తిగా ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టడం కష్టమవుతున్నందువల్ల, ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి ద్వారాలు తెరిచింది మోదీ సర్కారు. ప్రైవేటు రంగ పాత్ర పెంచేందుకు భారత అంతరిక్ష సంఘాన్ని ప్రారంభించింది. ఉపగ్రహ సేవలకు ఉన్న మార్కెట్‌ను ఉపయోగించుకుంటే భారతీయ ప్రైవేటు అంతరిక్ష సంస్థలు ఆకాశమే హద్దుగా పురోగమించగలుగుతాయి.

  • విద్యార్థుల చదువులకు కొండముచ్చు కాపలా!

Kondamuchu in School : ఆ ఊరితో పాటు పాఠశాలకు కోతుల బెడద ఎక్కువైంది. ఎంతగా అంటే విద్యార్థులు బయట తిరగాలంటే భయపడేంతగా. ఒకవేళ ఎవరైనా కనిపిస్తే మర్కటాల దాడి తప్పదు అన్నట్లు ఉండేది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఓ కొండముచ్చును తెప్పించారు. ఎందుకంటే..?

07:52 December 16

టాప్​టెన్​ ​న్యూస్​ @8AM

  • ఒమిక్రాన్ ఎంట్రీతో ఆ ప్రాంతంలో హైఅలర్ట్!

Omicron Cases in Hyderabad : తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీ ఇవ్వడంతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన హైదరాబాద్​లోని టోలిచౌకిలో వైద్య ఆరోగ్య శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో క్రిమిసంహారక ద్రావణం పిచికారీ చేయించింది. మరికొంత మంది శాంపిళ్లను సేకరించి ఆర్టీపీసీఆర్​కు పంపింది.

  • కరెంటు బిల్లు పెంచకపోతే నష్టాలు తప్పవు

Electricity Charges Hike Telangana : రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు యూనిట్​కు సగటున రూపాయి వరకైనా పెంచకపోతే నష్టాలు తప్పవని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో మూడో రోజు సమీక్ష జరిపారు. నష్టాలతో నడుస్తున్న సంస్థలను గట్టెక్కించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.

  • ఓబీసీ స్థానాలను జనరల్​ సీట్లుగా మార్చండి

OBC Reservation in Maharashtra: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓబీసీకి కేటాయించిన సీట్లను జనరల్​ స్థానాలగా మార్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పోలింగ్​ వాయిదా విజ్ఞప్తి తిరస్కరించింది ధర్మాసనం.

  • యాషెస్​ రెండో టెస్టుకు కమిన్స్​ దూరం

Pat Cummins Covid: కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్న కారణంగా యాషెస్ రెండో టెస్టుకు దూరమయ్యాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్. అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

  • పాన్​ఇండియాను మించేలా రామ్​చరణ్​-గౌతమ్ ​తిన్ననూరి సినిమా

Gowtam Tinnanuri Ram Charan: రామ్​చరణ్​తో తాను తెరకక్కించబోయే సినిమా యాక్షన్‌ కథాంశంతో ఉంటుందని తెలిపారు దర్శకుడు గౌతమ్​ తిన్ననూరి. పాన్‌ ఇండియా సినిమాకు మించిన స్థాయిలో ఈ మూవీని రూపొందించబోతున్నట్లు చెప్పారు.

07:00 December 16

టాప్​టెన్​ ​న్యూస్​ @7AM

  • రబీలో తగ్గిన వరి సాగు

Department of Agriculture Report 2021:రాబోయే యాసంగి ధాన్యం పంట సేకరించబోమని ఎఫ్‌సీఐ రాష్ట్రానికి లేఖ రాయడంతో... ఇక ఈ రబీ నుంచి వరి సాగు వద్దని ప్రభుత్వం రైతులకు తెలిపింది. ఈ నేపథ్యంలో రబీ సీజన్​లో ఇప్పటి వరకు వరిసాగు గణనీయంగా తగ్గింది. సాధారణ విస్తీర్ణంలో 18 శాతంలోనే నాట్లు పడ్డాయని అధికారులు తెలిపారు.

  • 'ఒమిక్రాన్‌' బాధితుల్లో కొత్త ముప్పు

Omicron symptoms: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్‌ సోకిన వారిలో డెల్టా కంటే భిన్నమైన లక్షణాలు కన్పిస్తున్నాయని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ డాక్టర్​ తెలిపారు. 'ఒమిక్రాన్​' బాధితులకు అలసట, బలహీనతతో పాటు రాత్రిపూట విపరీతమైన చెమటలు పడుతున్నాయని చెప్పారు.

  • సంపద సృష్టి సంస్థగా రిలయన్స్​

గత అయిదేళ్లలో దేశంలోనే అత్యంత అధికంగా సంపద సృష్టించిన కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) రికార్డు సృష్టించింది. 2016-21లో ఏకంగా రూ.9.6 లక్షల కోట్ల సంపదను జత చేసుకుని..2015-19లో తానే నెలకొల్పిన రికార్డును బద్ధలుగొట్టింది. ఈ విషయం మోతీలాల్‌ ఓస్వాల్‌ తాజా నివేదికలో వెల్లడైంది. ఆ నివేదికలోని మరిన్ని కీలక విశేషాలు ఏంటంటే..?

  • డివిలియర్స్‌పై ఆరోపణలు

AB De Villiers: జాతి వివక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు దక్షిణాఫ్రికా మాజీ స్టార్​ బ్యాటర్​ ఏబీ డివిలియర్స్​. గతంలో తన సహచర నల్లజాతి ఆటగాడిపై అతడు జాతి వివక్ష చూపినట్లు సామాజిక న్యాయం, దేశ నిర్మాణం కమిషన్‌ తన నివేదికలో వెల్లడించింది.

  • మూడేళ్లు అడవుల్లోనే!

Alluarjun Pushpa Movie: ఇప్పటివరకు తెరపై ఎవ్వరూ చూపించని కొత్త అడవులను 'పుష్ప' చిత్రంలో చూపించినట్లు తెలిపారు ప్రొడక్షన్‌ డిజైనర్‌ ద్వయం రామకృష్ణ-మోనిక. ఈ సినిమా కోసం.. కృత్రిమ ఎర్రచందనం దుంగల్ని భారీ సంఖ్యలో తయారు చేసి వినియోగించినట్లు చెప్పారు. మూడేళ్ల పాటు అడవుల్లోనే ఉండి పనిచేసినట్లు పేర్కొన్నారు.

04:48 December 16

టాప్​టెన్​ ​న్యూస్​ @ 6AM

  • 19 నుంచి పర్యటనలు

Cm KCR Districts tour:అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం సహా పార్టీ శ్రేణుల్లో స్తబ్ధత తొలగించి ఉత్సాహాన్ని నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. ఆదివారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు

  • హైదరాబాద్​లో 2 కేసులు

Omicron cases in telangana: రాష్ట్రంలో తొలిసారిగా రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస రావు తెలిపారు. కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళతో పాటు సోమాలియాకు చెందిన 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చినట్లు చెప్పారు

  • మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లు

మూడు కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కార్పొరేషన్ల ఛైర్మన్లుగా ముగ్గురు రెండేళ్ల పాటు బాధ్యతల్లో ఉండనున్నారు.

  • అసైన్డ్​ భూములకు పట్టాలు

ఒకరిద్దరికి కాదు.. నిబంధనలకు పాతరేస్తూ ఏకంగా వందల మందికి భూమి పట్టాలు జారీ అయ్యాయి. వారంతా ధరణి పోర్టల్లోనూ నిక్షిప్తమయ్యారు. సాగంటే తెలియని వ్యాపారులు, రాజకీయ నాయకులు కూడా పట్టాదారులయ్యారు. నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో భూదస్త్రాల ప్రక్షాళనను ఆసరాగా చేసుకుని పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి.

  • 'స్టే ఇవ్వలేం'

High court on Zonal Allotments: నూతన జోనల్ విధానంలో ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై స్టే ఇవ్వలేమని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. రంగారెడ్డి జిల్లా సరూర్​నగర్​కు చెందిన ఉపాధ్యాయురాలు దాఖలు చేసిన పిటిషన్​పై ఇవాళ ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది.

  • 'అతి పెద్ద స్మగ్లింగ్ వనరుగా మారింది'

justice nv ramana on smuggling: ఎర్రచందనం స్మగ్లింగ్​పై పాత్రికేయుడు ఉడుముల సుధాకర్ రెడ్డి రచించిన బ్లడ్ సాండర్స్ పుస్తకాన్ని దిల్లీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆన్​లైన్​లో ఆవిష్కరించారు. శేషాచలం అడవుల్లో ఉన్న గిరిజనులకే ఎర్రచందనం సంరక్షణ బాధ్యతను అప్పగిస్తూ ఉపాధి కల్పిస్తే.... స్మగ్లర్లను నిరోధించే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • ఆ వ్యక్తుల్లో మోదీకి 8వ స్థానం

ప్రపంచంలో అత్యంత ఆరాధించే వ్యక్తుల్లో 8వ స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. యూ-గవ్ డేటా అనలిటిక్స్ అనే కంపెనీ నిర్వహించిన సర్వే-2021 ఫలితాలను బుధవారం వెల్లడించింది. ఈ జాబితాలో టాప్‌-20లో అమితాబ్‌, షారూక్‌, సచిన్, విరాట్ కోహ్లీ.. మహిళల జాబితాలో ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్‌, సుధామూర్తి స్థానం సంపాదించారు.

  • మోదీతో ​గీతా భేటీ

Gita Gopinath meets PM modi: అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్​ డైరెక్టర్​గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న ఇండో-అమెరికన్ గీతా గోపీనాథ్​.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

  • ఇద్దరు హతం

Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్​ కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

  • రెండు రోజులు బంద్..

Bankers Strike: రాష్ట్రంలో రెండు రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో బ్యాంకింగ్‌ అమెండ్‌మెంట్‌ చట్ట సవరణ చేయకుండా నిలువరించాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత బ్యాంకర్ల సంఘం రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది.

Last Updated : Dec 16, 2021, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details