ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు6 నెలల చిన్నారితో సహా ఐదుగురు మృతి Road Accident in Krishna district: వేగంగా వస్తున్న కారు.. కల్వర్టును ఢీ కొట్టడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఆరు నెలల చిన్నారి కూడా ఉండటం అక్కడున్న వారిని కలచివేసింది. ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన వారంతా తెలంగాణ వాసులుగా పోలీసులు గుర్తించారు. చిన్నారి అన్నప్రాసన కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.Live Video: రైలుకింద పడి యువకుడి ఆత్మహత్యSuicide: రోడ్డు కానీ, రైల్వే ట్రాక్ కానీ దాటేటప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా దాటుతుంటాం. అటు నుంచి రైలు రావట్లేదని తెలిసి కూడా భయంభయంగా దాటేందుకు యత్నిస్తాం. కానీ ఈ యువకుడు మాత్రం అంతవరకూ స్టేషన్లో తచ్చాడుతూ సరిగ్గా ప్లాట్‌ఫాం మీదకు ట్రైన్ వచ్చే సమయానికి ట్రాక్ మీదకు దిగాడు. సడెన్‌గా పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఈ చేప మనిషిని చంపేంత విషపూరితం Poisonous Fish: అదొక వింతైన... విషపూరితమైన చేప. ఆ మీనం చూసేందుకు అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉంటుంది. మామూలుగానే కనిపించినా.. ఎవరైనా తాకారా... బంతిలా ఉబ్బుతుంది. దీనిలో మనిషిని సైతం చంపేంత విషం ఉంటుందట.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో మత్య్సకారుల వలకు చిక్కింది.ఉత్తరాఖండ్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా రీతూ?Uttarakhand cm candidate: ఉత్తరాఖండ్‌లో భాజపా ఏర్పాటు చేయనున్న ప్రభుత్వానికి నేతృత్వం వహించేది ఎవరనేదానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. పుష్కర్ సింగ్ ధామి ఓటమితో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిని నియమించాలని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార్తె రీతూ ఖండూరీ పేరు బలంగా వినిపిస్తోంది.బస్సులో మహిళపై అత్యాచారం.. Woman Raped Inside Bus: మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై బస్డ్రైవర్తో సహా మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.676 రోజుల కనిష్ఠానికి కరోనా కేసులుIndia Covid Cases:భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 676 రోజుల కనిష్ఠానికి పడిపోయింది. తాజాగా 3,116 మందికి వైరస్ సోకింది. మరో 47 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పరుచూరి! Paruchuri Venkateswarao latest photo: రచయితల ద్వయంలో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు సంబంధించిన తాజా ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన సినీప్రియులు ఆందోళన చెందుతున్నారు.అమెరికా కాన్సులేట్‌పై రాకెట్ల వర్షం!Missile attack Iraq American embassy: ఇరాక్‌లోని అమెరికా కాన్సులేట్‌పై శనివారం అర్ధరాత్రి క్షిపణుల వర్షం కురిసింది. దౌత్య కార్యాలయం భవనానికి పలు రాకెట్లు ఢీకొట్టటం వల్ల స్వల్పంగా ధ్వంసమైందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని భద్రతా అధికారులు తెలిపారు. సుమారు 12 మిసైల్స్ ప్రయోగించినట్లు అమెరికా తెలిపింది.శ్రీశాంత్‌పై సచిన్ ప్రశంసలు.. Sreesanth Sachin Tendulkar: టీమ్ఇండియా మాజీ పేసర్ శ్రీశాంత్‌పై ప్రశంసలు కురిపించారు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్. అతడిని ఎప్పుడూ ఎంతో నైపుణ్యం కలిగిన బౌలర్‌గానే చూస్తానని అన్నారు. ఇటీవలే శ్రీశాంత్ అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో అతడి సేవలను గుర్తుచేసుకుంటూ సచిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.'ఐపీఎల్లో బాగా రాణిస్తా'IPL 2022 Sarfaraz Khan: ఐపీఎల్లో తాను కూడా మంచి స్కోరు చేసే రోజు వస్తుందని రంజీ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. తనపై నమ్మకం ఉంచాలని ఈ ఏడాది అతడిని కొనుగోలు చేసిన దిల్లీ క్యాపిటల్స్ జట్టును కోరాడు.