1.ఏపీలో పంచాయతీ ఎన్నికలపై వీడిన ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఏపీ ఎస్‌ఈసీ
ఏపీలో పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీషెడ్యూల్ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంకాని నేపథ్యంలో గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌లో మార్పులు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.దేశీయ వ్యాక్సిన్ వచ్చిన గర్వంతో గణతంత్ర వేడుకలు
సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సినేషన్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. దేశీయ టీకా వచ్చిన గర్వంతో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని అన్నారు. ఎలాంటి అనుమానం లేకుండా అందరూ టీకా తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.'ఓటు హక్కుని గౌరవించాలి'
ఎన్నోపోరాటాల తర్వాత ప్రతిఒక్కరికీ ఓటు హక్కు వచ్చిందని గుర్తు చేశారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. అలాంటి ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ గౌరవించి, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతపై ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.'అర్నబ్‌కు బాలాకోట్ సమాచారం'పై రాహల్...
బాలాకోట్ దాడి సమాచారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే లీక్ చేసి.. వైమానిక దళ సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే.. ఆ దాడి సమాచారం మూడు రోజుల ముందుగానే రిపబ్లిక్ ఛానెల్లో ప్రసారమైందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.