ఏపీ ప్రభుత్వం తమను రిలీవ్ చేయడంపై.. వెలగపూడి సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు సీఎం జగన్ ఫొటోకు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. సచివాలయం వెలుపల టపాసులు కాల్చి సంబరాలు జరిపారు.
ఏపీ సీఎం చిత్రపటానికి.. తెలంగాణ ఉద్యోగుల పాలాభిషేకం
ఏపీలోని వెలగపూడి సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమను రిలీవ్ చేయడంపై సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు.
Telangana employees thanked the ap Chief Minister jaga
తమకు సహకరించిన ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేయడంపై తెలంగాణ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.