జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ అసోషియేషన్ దిల్లీలో ధర్నా చేపట్టింది. జంతర్‌మంతర్‌లో చేపట్టిన ఈ ధర్నాకు తెరాస ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, రాపోలు ఆనంద భాస్కర్, నటుడు ఆర్.నారాయణమూర్తి పాల్గొని మద్దతు తెలిపారు.
బీసీలు దేశానికి వెన్నెముకలాంటివారు: ఆర్.నారాయణ మూర్తి - telangana bc leaders dharna at jantharmanthar delhi for bc reservations
దేశంలో 53 శాతం ఉన్న బీసీ జనాభాకు దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని నటుడు ఆర్.నారాయణమూర్తి డిమాండ్ చేశారు. దిల్లీలో బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో తెరాస ఎంపీ బడుగుల లింగయ్య, సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్‌తో పాటు పాల్గొన్నారు.

బీసీలు దేశానికి వెన్నెముకలాంటివారు: ఆర్. నారాయణమూర్తి
దేశ జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్న వెనుకబడిన తరగతులకు చట్ట సభలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని.. కనీసం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కొన్ని కులాలకు కలిపి మంత్రిత్వ శాఖ ఉన్నట్లు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని బీసీల సంక్షేమానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
బీసీలు దేశానికి వెన్నెముకలాంటివారు: ఆర్. నారాయణమూర్తి
ఇదీ చూడండి: బంగారు టాయ్‌లెట్‌ను దొంగలెత్తుకెళ్లారు..!