వచ్చే ఆర్థిక సంవత్సరంలో జెండర్ బడ్జెట్ ఆలోచన తీసుకొస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా దిశ వాహనాలు ప్రారంభించిన ఆయన.. మహిళలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధికారత కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 900 దిశ వాహనాలతో పాటు దిశ కియోస్క్ యంత్రాలు, 18 దిశ క్రైం సీన్ మేనేజ్‌మెంట్ వాహనాలను.. వర్చువల్ విధానం ద్వారా ఆయన ప్రారంభించారు. సచివాలయంలో మహిళలపై వేధింపుల నివారణ కమిటీ లేదని.. తొలుత సచివాలయం నుంచే ఈ కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతి ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా కమిటీ తప్పక ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వాటిపో పాటు,
మహిళలపై నేరాలను తగ్గించగలిగాం
రాష్ట్రంలోని 18 దిశ స్టేషన్లకు.. ఒక్కో వాహనం ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టులు ఏర్పాటు చేస్తామని.. మహిళలపై నేరాలను 7.5 శాతం తగ్గించగలిగామన్నారు. దర్యాప్తు సమయాన్ని 100 నుంచి 53 రోజులకు తగ్గించినట్లు తెలిపిన ముఖ్యమంత్రి.. 563 నేరాలకు వారంలోగా ఛార్జ్‌షీట్లు తయారుచేశామన్నారు. దిశ పెట్రోలింగ్‌కు 900 స్కూటీలు ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. అనంతరం మహిళా హెల్ప్ డెస్క్‌లు ప్రారంభించిన ఆయన.. నేటి నుంచి అన్ని పోలీస్ స్టేషన్లలో ఇవి అందుబాటులో ఉంటాయన్నారు.
వారి పట్ల వివక్షతో సమాజ ప్రగతికి ఇబ్బందులు