గోమాతను ముక్కోటి దేవతలుగా భావించే మన దేశంలో... క్రూరంగా గోవధ జరగడం బాధాకరమని యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యుడు శివ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానంలో యుగ తులసి గోసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 'గో రక్షణ గో సంరక్షణ' నినాదంతో యాదాద్రి వరకు పాదయాత్ర విజయవంతంగా నిర్వహించామన్నారు.
'గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి' - యుగ తులసి ఫౌండేషన్
హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానంలో యుగ తులసి గోసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యుడు శివ కుమార్ పాల్గొన్నారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించేత వరకు తన పోరాటం కొనసాగుతుందని శివకుమార్ స్పష్టం చేశారు.

Spiritual meeting of yuga tulasi gosena in mint compound
గోమాత రక్షణ కోసం యుగ తులసి ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేస్తోందన్నారు. గో రక్షణ పాదయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ అభినందనలు తెలియజేశారు. గోవు గోవిందుడుగా భవించాలన్నారు. ప్రతి ఒక్కరూ గోరక్షణకు పాటుపడాలని సూచించారు. గోవధ నివారణ కోసం... ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేత వరకు తన పోరాటం కొనసాగుతుందని శివకుమార్ స్పష్టం చేశారు.