ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో దుకాణదారులు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచి అనంతరం మూసేస్తున్నారు. జిల్లాలోని మలికిపురం, రాజోలు, తాటిపాకలో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. అమలాపురంలో సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచుతున్నారు. రాత్రి 7 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచటం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుందని.. లాక్డౌన్ ఉన్నంతకాలం ఈ విధంగా దుకాణాలు ఒంటి గంట వరకే తెరిచి ఉంచుతామని వ్యాపారులు తెలుపుతున్నారు
కరోనా నియంత్రణకై దుకాణాదారుల ఆదర్శవంతమైన నిర్ణయం
కరోనా వైరస్‌పై అధికారులు, పోలీసుల నియంత్రణే కాదు మార్పు మనలో రావాలి అంటున్నారు ఏపీ తూర్పుగోదావరి జిల్లాలోని వ్యాపారులు. ప్రాణాలు మనవి కాపాడుకోవాల్సిన బాధ్యతా మనదే.. కాబట్టి ప్రతి మనిషికి స్వీయ నియంత్రణ ఉండాలని చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని దుకాణాలను 7గంటల వరకూ తెరుచుకోవచ్చని అనుమతి ఇచ్చినప్పటికీ..ఇక్కడ మాత్రం మధ్యాహ్నం 1వరకే అందుబాటులో ఉంచుతున్నారు.
కరోనా నియంత్రణకై దుకాణాదారుల ఆదర్శవంతమైన నిర్ణయం