తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ పాఠశాలలో 518 ఏళ్లుగా అదే యూనిఫాం! - Christ Hospital Boarding School uniform

స్కూలు పిల్లలు పొద్దున్నే లేచి చకచకా రెడీ అయి యూనిఫాం వేసుకుని బడికి వెళ్తుంటే చూడటానికి ముచ్చటగా ఉంటుంది. కానీ ఆ బడికి 518 ఏళ్లుగా ఒకటే యూనిఫాం ఉందంటే వింతే కదా!

Christ Hospital Boarding School in England
క్రైస్ట్‌ హాస్పిటల్‌ బోర్డింగ్‌ స్కూల్‌ యూనిఫాం

By

Published : Nov 1, 2020, 1:10 PM IST

ఇంగ్లాండులోని ‘క్రైస్ట్‌ హాస్పిటల్‌ బోర్డింగ్‌ స్కూల్‌’కు ఓ ప్రత్యేకత ఉంది. 518 ఏళ్లుగా ఆ బడికి ఒకటే యూనిఫాం ఉందంటే వింతే కదా! దీన్ని 1552లో స్థాపించి... పొడవాటి నీలిరంగు గౌను, మెడకు తెల్లని బ్యాండ్‌, పసుపూ, బూడిదరంగు సాక్సులను యూనిఫాంగా నిర్ణయించారట. ఇక అప్పటి నుంచీ ఇన్నేళ్లయినా దాన్నే కొనసాగిస్తున్నారు! దుస్తుల విషయంలో కాలానుగుణ మార్పులు సహజం. కానీ వారు ఇప్పటికీ ఆ పురాతన మోడల్‌నే వాడుతున్నారు. ఈ యూనిఫాం అంటే స్టూడెంట్లకు ఎంత ఇష్టమంటే.. దీన్ని మార్చాలా వద్దా అని 2011లో అభిప్రాయ సేకరణ చేస్తే 95శాతం మంది మార్చొద్దనీ, ఇదే కావాలనీ పట్టుబట్టారట!

ABOUT THE AUTHOR

...view details