కూకట్‌పల్లిలోని వడ్డేపల్లి ఎంక్లేవ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేస్తోన్న ఇండియన్ పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని పోలీసు బందోబస్తు మధ్య తొలిగించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసి.. చర్యలు చేపట్టారు.
ఇండియన్ పెట్రోల్ బంక్ నిర్మాణాలు కూల్చివేత - కూకట్పల్లి రెవిన్యూ అధికారుల వార్తలు
కూకట్‌పల్లిలోని వడ్డేపల్లి ఎంక్లేవ్ ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను రెవిన్యూ అధికారులు తొలిగించారు. నాలా, బఫర్‌జోన్ పరిధిలో ఉన్న భూమిలో నిర్మించనున్న ఇండియన్ పెట్రోల్ బంక్‌కు చెందిన నిర్మాణాలను జేసీబీతో కూల్చివేశారు.

ఇండియన్ పెట్రోల్ బంక్ నిర్మాణాలను తొలగించిన అధికారులు
వడ్డేపల్లి ఎంక్లేవ్ ఎదురుగా నూతనంగా ఇండియన్ పెట్రోల్ బంక్ నిర్మిస్తున్నారు. ఈ స్థలంలో 452 గజాల స్థలం నాలా, బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ మేరకు కూకట్పల్లి మండల రెవెన్యూ అధికారులు అందులోని నిర్మాణాలు తొలిగించారు. నాలా స్థలాన్ని ఆక్రమించి.. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: విద్యావాలంటీర్లను రెగ్యూలర్ చేయాలి: ఆర్.కృష్ణయ్య