Revanth reddy house arrest : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడికి పిలుపును ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరమ్మ విగ్రహం నుంచి ఖైరతాబాద్ వరకు ప్రదర్శన చేపట్టనట్లు తెలియడంతో.... పోలీసులు నాయకుల ఇళ్ల చుట్టూ భారీగా మోహరించారు.
కాంగ్రెస్ నేతల గృహనిర్బంధం.. నిరసనకు వెళ్లకుండా అడ్డగింత
Revanth reddy house arrest : చమురు, గ్యాస్, విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.
Congress Protest in Telangana : ఇప్పటికే రేవంత్ ఇంటిని పెద్దసంఖ్యలో పోలీసులు చుట్టూ ముట్టారు. ఇంధన ధరలతో పాటు విద్యుత్ ఛార్జీలు తగ్గించడం, ధాన్యం కొనే దాకా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని రేవంత్ నిన్న వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు మల్లు రవి, షబ్బీర్ అలీ, దాసోజు శ్రవణ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నిరసనలకు వెళ్లకుండా ఇళ్ల వద్దనే నేతలను అడ్డుకున్నారు. ఇవాళ విద్యుత్‌సౌధ, సివిల్ సప్లయిస్ భవన్‌ల ముట్టడికి ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఈ మేరకు ముందస్తు చర్యలు తీసుకున్నారు.