KTR Work From Home: పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వర్క్ ఫ్రం హోం విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. కింద పడి చీలమండకు గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు మూడు వారాల పాటు విశ్రాంతిలో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా.. వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్.. తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. తాను ఇంటి నుంచి పని చేస్తూ.. కొన్ని దస్త్రాలు పరిశీలిస్తున్నట్లు ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
రెండు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ కాలికి.. ప్రమాదవశాత్తు గాయమైంది. ఈ క్రమంలో వైద్యులు ఆయనకు మూడు వారాల విశ్రాంతి సూచించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్.. ఆయన అభిమానులతో ట్విటర్ వేదికగా తెలిపారు. తన జన్నదినానికి ముందు రోజునే ఇలా జరిగింది. అయితే.. విశ్రాంతి సమయంలో చూసేందుకు ఓటీటీలో ఏవైనా మంచి కార్యక్రమాలు, సినిమాలు సూచించాలని ట్వీట్లో కేటీఆర్ కోరగా.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. చాలా వరకు నెటిజన్లు తమకు తెలిసిన, నచ్చిన సినిమాలు, సిరిస్‌లు, కార్యక్రమాల పేర్లను సూచించారు.