KTR tweet on Amit shah: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్రంపై ట్విటర్ వేదికగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వ్యతిరేకి అన్న అమిత్‌షాపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్‌షా.. కేసీఆర్‌ను రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్ధపు జోక్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధును కాఫీకొట్టి ప్రధానమంత్రి కిసాన్ యోజన పేరిట ప్రవేశపెట్టారని ట్వీట్ చేశారు. రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి 700 మంది రైతుల ప్రాణాలను బలిగొన్న తర్వాత.. దేశ రైతాంగం తీవ్ర వ్యతిరేకత వల్ల క్షమాపణ చెప్పిన వారెవరని ప్రశ్నించారు.
కేసీఆర్ రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్దపు జోక్ అంటూ కేటీఆర్ ఎద్దేవా
KTR tweet on Amit shah కేంద్ర హోం శాఖ మంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌షాను ఉద్దేశిస్తూ ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ విమర్శలు సంధించారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అన్న షాపై తీవ్రంగా మండిపడ్డారు. అమిత్‌షా కేసీఆర్‌ను రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్ధపు జోక్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధును కాఫీకొట్టి ప్రధానమంత్రి కిసాన్ యోజన పేరిట ప్రవేశపెట్టారని ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి పంటల బీమా పథకంలో చేరలేదని కేసీఆర్‌ను విమర్శిస్తున్న అమిత్‌షా, మరి గుజరాత్ ప్రభుత్వం అదే పథకాన్ని ఎందుకు తిరస్కరించిందో చెప్పాలని ప్రశ్నించారు. ఆ పథకం నుంచి ఎందుకు వైదొలిగిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సొంత రాష్ట్రం గుజరాత్‌లో రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం కలిగించని ఆ పథకం తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా... అర్థరహితమైన కపట నాటకాలు వదిలిపెట్టాలని అమిత్‌షాకు కేటీఆర్ సూచించారు.