తిరుమల శ్రీవారి ఆలయం వద్ద వివాహాలు చేసుకునేందుకు.. దూర ప్రాంతాల నుంచి వెళ్తున్న వారికి విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. ఆలయం వద్ద పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించే పురోహితులు అందుబాటులో లేని కారణంగా.. ముహూర్త సమాయానికి వధువు మెడలో వరుడు తాళి కట్టి వెనుదిరుగుతున్నారు.
పురోహితుడు లేకుండానే... తిరుమలలో కల్యాణం - marriages without priest news
కుటుంబ సభ్యులతో ఆనందంగా వచ్చి... వివాహం చేసుకునేందుకు తిరుమలకు తరలివెళ్తున్న వారికి నిరాశే మిగులుతోంది. శ్రీవారి ఆలయం వద్ద పెళ్లి తంతు నిర్వహించే పురోహితులు అందుబాటులో లేకపోవడం వల్ల ... వధువు మెడలో వరుడు తాళి కట్టి, వెనుతిరుగుతున్నారు.

ఎందుకిలా..
తిరుమల శ్రీవారి కొండపై సంపన్నులు, మధ్య తరగతి, పేద వారు వివాహాది శుభకార్యాలు చేసుకునేందుకు వసతులు ఏర్పాటు చేశారు. పేదవారు వివాహాలు నిర్వహించుకునే పురోహిత సంఘాన్ని... కరోనా కారణంగా గతేడాది నుంచి మూసివేశారు. లాక్డౌన్ నిబంధనలు సడలింపుల అనంతరం... మఠాల్లో, కల్యాణమండపాల్లో వివాహాలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చినా... పురోహిత సంఘానికి అనుమతులు ఇవ్వలేదు. ఈ కారణంగా... శ్రీవారి ఆలయం వద్ద వివాహాలు చేసుకునేందుకు వచ్చే వారు... పురోహితులు లేకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. వివాహాలకు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చి... పురోహిత సంఘాలకు మాత్రం అవకాశం ఇవ్వకపోటంపై విమర్శలు వస్తున్నా, తితిదే అధికారులు మాత్రం కరోనాను సాకుగా చూపి కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి.