మద్యం అమ్మకాల ద్వారా మరింత రాబడిని ఖజానాకు జమ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం విక్రయాలు, లైసెన్సుల జారీ, దరఖాస్తుల విక్రయం, ప్రత్యేక ఎక్సైజ్ పన్ను, ప్రివిలేజ్ టాక్స్ తద్వారా గత ఏడాది ఇరవై ఒక్క వేల కోట్లు ఆదాయం వచ్చింది. ఈసారి మరో ఐదువేల కోట్లు మద్యం విక్రయ ద్వారా ఆర్జించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. అందుకోసం 15 నుంచి 25% వరకు మద్యం ధరలు పెంచాలని అబ్కారీ శాఖ యోచిస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు లోతైన అధ్యాయనం చేస్తున్నారు.
ధరల పెంపు - అబ్కారీ శాఖ విశ్లేషణ
- ఏ బ్రాండ్‌కు ఎంత గరిష్ఠ చిల్లర ధర ఉంది
- గ్రామాలు, పట్టణాలలో ఏ బ్రాండ్ ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి
- ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో డిమాండ్ ఉన్న బ్రాండ్ ఏది..?
- గ్రామీణ ప్రాంతంలో డిమాండ్ ఉన్న బ్రాండ్ ఏది..?
- రాష్ట్రంలో లిక్కర్ కంటే బీర్లను ఎక్కువగా విక్రయిస్తున్నారు. వాటిలో ఏ రకం బీరుకు ఎక్కువ గిరాకీ ఉందో పరిశీలించి ధరల పెంపును అమలు చేస్తారు.
బ్రాండ్ల డిమాండ్ బట్టి ధరలు పెంపు..!