రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలతోపాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
జర జాగ్రత్త: రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు వర్షాలు
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగ్నేయ ఉత్తర ప్రదేశ్ నుంచి దక్షిణ ఛత్తీష్‌గఢ్ వరకు 5.8కిమీ ఎత్తు వద్ద ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ప్రకటించింది.
telangana rains
ఆగ్నేయ ఉత్తర ప్రదేశ్ నుంచి దక్షిణ ఛత్తీష్‌గఢ్ వరకు 5.8కిమీ ఎత్తు వద్ద ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించారు.
ఇదీ చదవండి :'మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రతిపక్షాల కుట్ర'