మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. పెండింగ్‌లోని 89 పిటిషన్లను అత్యవసరంగా కొట్టివేయాలని సింగిల్ జడ్జిని ప్రభుత్వం కోరింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సీజే ధర్మాసనం కొట్టివేసిందని ప్రభుత్వం తెలిపింది. ఈ అభ్యర్థనపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, తమ రిట్ పిటిషన్లలో అంశాలు వేర్వేరుగా ఉన్నాయని పిటిషనర్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లన్నీ ధర్మాసనం ముందుంచుతామని సింగిల్ జడ్జి పేర్కొన్నారు.
'మున్సిపల్ ఎన్నికల పిటిషన్లన్నీ ధర్మాసనం ముందుకు..' - Telangana municipal elections

మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ
11:42 October 31
మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ
Last Updated : Oct 31, 2019, 1:17 PM IST