GHMC Property Tax : జీహెచ్ఎంసీ ఓ సరికొత్త రికార్డుకు త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. వెయ్యి కోట్ల రూపాయల చేరువలో ఆస్తిపన్ను వసూళ్లు చేసింది. తొలి 4 నెలల్లోనే రూ.999.05 కోట్ల ఆస్తి పన్ను వసూల్ చేసి జీహెచ్‌ఎంసీ చరిత్ర సృష్టించింది. ఎర్లీ బర్డ్ పథకంలో 5 శాతం రిబేట్‌తో రూ.741.35 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను లక్ష్యం రూ.2 వేల కోట్లు పెట్టుకుంది. ఏప్రిల్, మే, జూన్‌లలో రూ.929.65 కోట్లు వసూల్ చేయడంతో తన టార్గెట్‌ను పూర్తి చేయడం సులువుగా మారింది. జులైలో జీహెచ్‌ఎంసీ రూ.68.1 కోట్ల ఆస్తి పన్ను వసూల్ చేసింది.
GHMC Property Tax : రూ.వెయ్యి కోట్లకు చేరువలో జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లు
GHMC Property Tax
12:56 August 02
రూ.వెయ్యి కోట్లకు చేరువలో జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లు
Last Updated : Aug 2, 2022, 1:36 PM IST