పిల్లల్లో జాతీయ భావం పెంపొందించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. చంద్రశేఖర్ కట్టిపల్లి రచించిన 'గాంధీ అండ్ లింకన్' పుస్తకాన్ని హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్‌లోని ఫ్యాప్సి ఆడిటోరియంలో మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్తో కలిసి ఆవిష్కరించారు. మాహాత్మ గాంధీ, అబ్రహాం లింకన్ సారూప్యత ఉన్న చరిత్రకారులన్నారు.
గాంధీ అండ్ లింకన్ పుస్తకావిష్కరణ - gandhi and linkon book released by governer
చంద్రశేఖర్ కట్టిపల్లి రచించిన 'గాంధీ అండ్ లింకన్' పుస్తకాన్ని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆవిష్కరించారు. గాంధీ, లింకన్ మార్గంలో యువత నడవాలని సూచించారు.

'గాంధీ అండ్ లింకన్' పుస్తకావిష్కరణ
గాంధీ, లింకన్ సిద్ధాంతాలు, ఆశయాలు ఒకే పుస్తకంలో పొందుపర్చడం గొప్ప విషయమని గవర్నర్ ప్రశంసించారు. ఈ రోజుల్లో మంచి విషయాల కంటే కాంట్రవర్సీ విషయాలు వైరల్ అవుతున్నాయన్నారు. అలాంటి వాటికి తావివ్వకుండా పుస్తకాన్ని రచించారని రచయితను అభినందించారు. ట్రంప్ పర్యటన సమయంలోనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషకరంగా ఉందన్నారు.
'గాంధీ అండ్ లింకన్' పుస్తకావిష్కరణ
ఇదీ చూడండి:విద్యుత్ వినియోగం పెరుగుతోంది.. అందుకే!