ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ వద్ద నెమలి కోణం చేప స్థానికులను అబ్బురపరిచింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారుల వలకు చిక్కిన ఈ చేపను అంతర్వేది పల్లి పాలెం ఫిషింగ్ హార్బర్‌కు తీసుకువచ్చారు.
మయూరిని పోలీన మీనం.. సముద్రంలో పురివిప్పి ఈత - east godavai dst peacock fis
చేపల్లో చాలా రకాలు ఉంటాయి. కానీ ఈ చేపమాత్రం ఏకంగా నెమలిలానే ఉంది. సముద్రంలో పురివిప్పి తిరుగుతుందట. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ వద్ద ఈ చేపను చూసి స్థానికులు మంత్రముగ్ధులయ్యారు.

మయూరిని పోలీన మీనం...సముద్రంలో పురివిప్పి ఈత
అచ్చం నెమలిని పోలి ఉన్న ఈ చాప వెన్నుపై పింఛం ఉంది. ఇది సముద్రంలో పురివిప్పి తిరుగుతుందని స్థానిక మత్స్యకారులు తెలిపారు. దీనిని స్థానిక వ్యాపారి మూడు వేల రూపాయలకు కొనుగోలు చేశాడు.
ఇవీచూడండి:ఏ చావైనా.. కొవిడ్ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల