ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో మాజీమంత్రి, కౌన్సిలర్ అభ్యర్థి మధ్య జరిగిన సంభాషణ ఇలా జరిగింది. ఆ మాజీమంత్రి ఓ పార్టీ అభ్యర్థి అనుకొని ఫోన్ చేశారు. కానీ తీరా మాట్లాడాక తెలిసింది అవతలి వ్యక్తి అనుకున్న అభ్యర్థి కాదని... అసలు వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణ ఎలా సాగిందంటే...
మాజీమంత్రి: ఏంలేదు గానీ మన క్యాండెట్ ఒకరు... ఏందదీ.. మన వైఎస్నగర్...
కౌన్సిలర్ అభ్యర్థి:అట్లగాదు సార్.. ఇప్పుడు మేం నిలబడిందే ఆరు చోట్ల. ఒక క్యాండెట్కి రాత్రి డబ్బులిచ్చి కొనేసినారు. మిగతా దాంట్లో కూడా...
మాజీమంత్రి:ఎన్నో వార్డు
కౌన్సిలర్ అభ్యర్థి: ఇది ఎనిమిదో వార్డు సార్... మార్కెట్ యార్డు వాళ్లు
మాజీమంత్రి: అది నాకు ఐడియా కూడా లేదు.
కౌన్సిలర్ అభ్యర్థి: అట్లా కాదు సార్.. మేం ఆరు వార్డుల్లో... దాంట్లో ఒక వార్డు మీరు తీసుకున్నారు. మిగతా వార్డుల్లో అయినా మేం చేసుకోకూడదా సార్..
మాజీమంత్రి:ఎనిమిదో వార్డులో నిలబడింది... నాకు ఐడియా కూడా లేదు.
కౌన్సిలర్ అభ్యర్థి: మీరే న్యాయం చెప్పండి సార్... 42 వార్డుల్లో మేం ఐదు వార్డుల్లో నిలబడ్డాం.
మాజీమంత్రి:ఇప్పుడు నేను కూడా ఏం అనడం లేదు. ఇప్పుడు ఏందంటే... మా వైస్నగర్ రమణ కూడా కొంచెం పేదవాడు. పని చేస్తాడు.
కౌన్సిలర్ అభ్యర్థి:ఆహా... అట్ల కాదు సార్.. ప్రతీఒక్క వార్డులో మీ క్యాండెట్లు అందరు చెప్తున్నారు. ఇంకా రాజకీయపరంగా ఎవ్వరూ ముందుకు రావద్దా చెప్పండి సార్. మీరే అందరూ... ఎప్పుడు మీరే ఉండాల్న చెప్పండి..
మాజీమంత్రి:లేదండి.. నేను అట్లా అనడంలే.
కౌన్సిలర్ అభ్యర్థి:దేవుని దయవల్ల మీరు ఇంతకు ముందర మినిస్టర్ అయినారు. మీ కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే అయినారు. ఇప్పుడు మీ కోడలు వచ్చి... ఛైర్మన్ (ఛైర్పర్సన్) పదవి కూడా వచ్చేస్తుంది. అది కూడా సంతోషమే. మీరే ఆలోచించండి.