తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 9PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @9pm

By

Published : Jul 17, 2020, 9:00 PM IST

1. కూల్చివేతకు హైకోర్టు పచ్చ జెండా

సచివాలయం భవనాల కూల్చివేతలపై కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. భవనాల కూల్చివేతలు చేపట్టడం వల్ల వాటిని ఆపాలంటూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'గతంలో మాదిరిగా ఉండొద్దు'

కొత్తగా నిర్మించే సచివాలయ భవన సముదాయం రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింప చేసే విధంగా రూపొందించాలని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రానికి ఉండాల్సిన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉండాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'సర్కారు అండగా ఉంటుంది'

కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా ఉండరాదని సీఎం అన్నారు. వైరస్ సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'మిషన్ భగీరథ బృందాలను పంపండి'

జాతీయ జల్‌జీవన్ మిషన్ డైరెక్టర్‌ మనోజ్‌కుమార్ సాహు అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. తెలంగాణలో అనుసరిస్తున్న మిషన్ భగీరథ విధానం అందరికీ మార్గదర్శకమన్నారు. ఫ్లో కంట్రోల్ వాల్వ్ సాంకేతికత అధ్యయనానికి తెలంగాణకు బృందాలను పంపాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. తమిళనాడు, కర్ణాటకలో కరోనా విజృంభణ

కరోనా మహమ్మారి దేశంలో అంతకంతకూ విజృంభిస్తోంది. ఇవాళ తమిళనాడులో రికార్డు స్థాయిలో 4,538 కేసులు నమోదయ్యాయి. దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్, కర్ణాటక​లోనూ బాధితులు పెరుగుతున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. అమర్​నాథ్​ యాత్రపై ఉగ్రదాడికి కుట్ర

అమర్​నాథ్​ యాత్ర లక్ష్యంగా ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారు. యాత్రికులపై దాడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు భారత సైన్యాధికారి తెలిపారు. అయినా ఎలాంటి అవరోధాలు లేకుండా యాత్రను శాంతియుతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ప్రతి 10 లక్షల జనాభాకు 727 కరోనా కేసులు

దేశంలో ప్రతి పది లక్షల మందికి 727 కరోనా కేసులే ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసులతో పోలిస్తే 4-8 రెట్లు తక్కువేనని తెలిపింది. కరోనాతో దేశంలో 10 లక్షలకు 18.6 మంది మరణిస్తున్నారని... అది ప్రపంచంలోనే అత్యల్ప మరణాల రేటని ఆరోగ్య శాఖ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. దిగొచ్చిన బంగారం, వెండి

పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర శుక్రవారం రూ.271 దిగొచ్చింది. కిలో వెండి ధర రూ.512 తగ్గింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'ఐపీఎల్​ నిర్వహణకు ఎప్పుడో సిద్ధం'

ఐపీఎల్​ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు దుబాయ్​ స్పోర్ట్స్​ సిటీస్​ హెడ్​ ఆఫ్​ క్రికెట్​ అండ్​​ ఈవెంట్స్​ సల్మాన్​ హనీఫ్​ తెలిపారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ మ్యాచ్​లు జరిగేలా స్టేడియంలో చాలినన్ని పిచ్​లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

10. కోటీ 40 లక్షలు దాటిన కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటీ 40 లక్షలు దాటింది. మృతుల సంఖ్య ఆరు లక్షలకు చేరువగా ఉంది. బ్రెజిల్​లో మొత్తం బాధితుల సంఖ్య 20 లక్షలు దాటిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details