తెలంగాణ

telangana

By

Published : Mar 12, 2021, 6:58 PM IST

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 7PM NEWS
టాప్​టెన్ న్యూస్ @7PM

1. 'యాదాద్రి ప్రత్యేకత చాటుకోబోతోంది'

యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని పున:ప్రారంభం కోసం తుదిమెరుగులు దిద్దే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. క్యూలైన్ల నిర్మాణాన్ని వచ్చే నెల 15వతేదీ కల్లా పూర్తి చేయాలని గడువు విధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'ఉద్యమ స్ఫూర్తితోనే సాకారం'

‍‌స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణను సాకారం చేసుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌ వేదికగా రాష్ట్రంలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌' వేడుకలకు సీఎం అంకుర్పారణ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. పోలింగ్‌కు ఏర్పాట్లు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అదనపు డీజీ, కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. మొబైల్​ నెట్​వర్క్​ మోసం

మొబైల్​ నెట్​వర్క్​ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. అతను ఇతర నెట్​వర్క్​ సంస్థల పేరిట మీ ప్లాన్​ గడువు ముగుస్తుందని ఫోన్​ చేస్తాడు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఉత్తరాఖండ్​ సీఎం కేబినెట్

ముఖ్యమంత్రి పదవి చేపట్టాక తొలిసారి కేబినెట్ విస్తరణ చేపట్టారు ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్. గవర్నర్​ సమక్షంలో నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. కాంగ్రెస్​ స్టార్​ క్యాంపెయినర్​

బంగాల్​లో ఎన్నికల ప్రచారం చేయనున్న 30 మంది ప్రముఖుల జాబితాను కాంగ్రెస్​ విడుదల చేసింది. ఈ జాబితాలో అధ్యక్షురాలు సోనియా సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. సీట్ల లెక్కలు ఫైనల్​

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేపథ్యంలో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటును ఆగమేఘాలపై పూర్తి చేసుకున్నాయి ప్రధాన పార్టీలు. పోటీలో నిలిచే అభ్యర్థులను ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. తీవ్రంగా స్పందించిన చైనా

దేశాల మధ్య సమావేశాలు మూడో పక్షానికి నష్టం చేకూర్చరాదని అన్నారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిజియన్. పరస్పర సహకారం, సంబంధాల బలోపేతం కోసమే వాటిని నిర్వహించాలని క్వాడ్​ సదస్సును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. భారత్​ బ్యాటింగ్

అహ్మదాబాద్​ వేదికగా టీమ్ఇండియా, ఇంగ్లాండ్​ మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​ కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​ బౌలింగ్​ ఎంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.​​

10. హీరోయిన్ నిశ్చితార్థం

జైపుర్​లోని ఓ కోటలో హీరోయిన్ మెహరీన్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ఆమెనే ఇన్​స్టా వేదికగా పంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details