తెలంగాణ

telangana

By

Published : Jan 3, 2021, 6:59 PM IST

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 7PM NEWS
టాప్​టెన్ న్యూస్ @7PM

1. 'అన్నిదేశాలకు అందిస్తాం'

వైరల్ ప్రోటీన్లను తట్టుకునేలా కొవాగ్జిన్ రూపొందించినట్లు భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలను కొవాగ్జిన్ ఉత్పత్తి చేసిందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. భారత్​ సిద్ధం

కొవిషీల్డ్, కొవాగ్జిన్​ టీకాలను భారత్​లో అత్యవసరంగా వినియోగించేందుకు డీసీజీఐ పచ్చ జెండా ఊపింది. ఈ టీకాలు భద్రం, సురక్షితమని తెలిపింది. రెండు స్వదేశీ టీకాలకు అనుమతి లభించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్​ భారత్​కు ఇది కీలక ముందడుగు అన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'రోజూ 10 లక్షల మందికి'

హైదరాబాద్ ట్యాంక్​బండ్​లోని బుద్దుడి విగ్రహం వద్ద బౌద్ధానికి సంబంధించిన క్యాలెండర్​ను మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు. బుద్దుడి ఆలోచనలను ప్రతిఒక్కరూ అలవరుచుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. హైదరాబాద్ వచ్చిన ఐష్

బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యారాయ్ ఆదివారం​ కుటుంబంతో సహా హైదరాబాద్​కు వచ్చారు. లాక్​డౌన్ విధించిన దాదాపు పది నెలల తర్వాత ఐష్​ బయటకు వచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. దారుణ హత్య

నిజామాబాద్ జిల్లా చందూరు మండలం ఘనపూర్‌ వద్ద దారుణం జరిగింది. ఉమ్నాపూర్‌కు చెందిన సుజాత(30), ఆమె ఏడాదిన్నర బాబు హత్యకు గురయ్యారు. 3 రోజుల క్రితం సుజాత, ఆమె బాబును రాము అనే వ్యక్తి కట్టెల కోసం అడవికి తీసుకెళ్లాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'గెలిస్తే రుణాలు మాఫీ'

తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు వివిధ హామీలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తాము అధికారంలోకి వస్తే విద్యా రుణాలను మాఫీ చేస్తామని డీఎంకే ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'అహంకార ప్రభుత్వం ఏలుతోంది'

అన్నదాతల కష్టాలను పట్టించుకోని అహంకార ప్రభుత్వం మొదటిసారి రాజ్యమేలుతోందని భాజపాను ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షురాలు​ సోనియాగాంధీ ఆరోపించారు. ఎలాంటి షరతులు లేకుండా సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఎడారిలో కార్ల రేస్​

కళ్లు చెదిరే దృశ్యాలు, ప్రమాదకర ఎడారి దారులు, మెరుపు వేగంతో దూసుకెళ్లే రైడర్లు.. ఇవన్నీ కలగలిపిన 2021 దాకర్ రేస్​ సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. రేస్​లో పాల్గొనే రైడర్లు జెడ్డాకు వచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. కోహ్లీ, పాండ్యాలపై ప్రచారం!

ఆస్ట్రేలియాలో ఇటీవలే పలువురు టీమ్ఇండియా క్రికెటర్లు కరోనా నిబంధనలు అతిక్రమించారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్​ కోహ్లీ, హార్దిక్​ పాండ్యా కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆసీస్​ మీడియా సంస్థలు వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. పట్టుబడ్డ నటి

ముంబయిలోని ఓ హోటల్‌లో నిన్న రాత్రి ఎన్‌సీబీ అధికారులు దాడి చేశారు. ఈ సమయంలో ఓ టాలీవుడ్‌ నటిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details