తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @9PM

By

Published : Jun 5, 2021, 8:52 PM IST

Updated : Jun 5, 2021, 9:04 PM IST

చేరువగా వైద్యం

రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పునకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లో ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో... 19 వైద్య పరీక్ష కేంద్రాలు జూన్ 7న ప్రారంభించాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'వీసమెత్తు నష్టం లేదు'

"తెరాస నాయ‌కుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిర‌సావ‌హించ‌డం నా కర్తవ్యంగా భావిస్తాను. కేసీఆర్ పార్టీ అధ్యక్షులే కాదు.. నాకు గురువు, మార్గదర్శి, తండ్రితో స‌మానులు. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కేసీఆర్ మాట జ‌వ‌దాట‌ను. ఈటల పార్టీ వీడితే.. వీసమెత్తు కూడా నష్టం లేదు."- మంత్రి హరీశ్​రావు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

10బెడ్​ ఐసీయూ ప్రాజెక్ట్​

కొవిడ్ కట్టడికి ప్రతి జిల్లాలో 10 పడకలతో కూడిన ఐసీయూ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన 10బెడ్ ఐసీయూ ప్రాజెక్టును ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీవోల గ్రూప్ నిర్వహిస్తోన్న ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి క్రిటికల్ కేర్ ఐసీయూ యూనిట్​ను నారాయణపేట్ జిల్లాలో వర్చువల్​గా ప్రారంభించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

తగ్గుతున్న కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. లక్షా 38 వేల 182 పరీక్షల ఫలితాలు రాగా.. 2వేల 70 పాజిటివ్ కేసులు బయటపడినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా బారిన పడి మరో 18 మంది మరణించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ఆగిన రిజిస్ట్రేషన్లు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేష‌న్లు ఆగిపోయాయి. గత రెండుమూడు రోజులుగా సర్వర్​లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆటంకాలు కలుగుతూ వస్తున్నాయి. గంట పని చేస్తే రెండు గంటలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

అన్​లాక్​పై రాష్ట్రాల దృష్టి

కరోనాను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసులు తగ్గిన రాష్ట్రాలు.. అన్​లాక్​పై దృష్టి సారిస్తున్నాయి. మహారాష్ట్ర, దిల్లీ వంటి రాష్ట్రాలు సడలింపుల దిశగా అడుగులు వేస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'ఆ లక్ష్యం ఐదేళ్ల ముందుకు'

2030 నాటికి పెట్రోల్​లో 20శాతం ఇథనాల్​ కలపాలనే లక్ష్యాన్ని ఐదేళ్లు ముందుకు జరిపినట్లు తెలిపారు ప్రధాని మోదీ. ఇథనాల్ రంగ అభివృద్ధి ద్వారా పర్యావరణ పరిరక్షణ సహా రైతులకు ఆర్థికంగా మేలు చేయనున్నట్లు వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

వేగంగా టీకా

ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల టీకా డోసులు పంపిణీ జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇందులో 60 శాతం డోసులు.. అమెరికా, భారత్, చైనా పొందినట్లు తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

యూఏఈకి తరలించడం ఖాయమే!

టీ20 ప్రపంచకప్(T20 World Cup)​ యూఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ ఒప్పుకుందని ఓ బోర్డు (BCCI) అధికారి తెలిపారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వస్తుందని వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

మహేశ్​ అభిమానులకు శుభవార్త

ఇది నిజంగా మహేశ్​ అభిమానులకు పండగలాంటి వార్తే! ప్రస్తుతం అతడు చేస్తున్న 'సర్కారు వారి పాట', త్రివిక్రమ్​తో చేయబోయే సినిమాను.. కేవలం ఆరు నెలల వ్యవధిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Jun 5, 2021, 9:04 PM IST

ABOUT THE AUTHOR

...view details