19 ఏళ్ల బంధానికి బై
తెరాసతో ఉన్న 19 ఏళ్ల అనుబంధాన్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajendhar) తెంచుకున్నారు. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని స్పష్టంచేశారు. తెరాస సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఈటల ప్రకటించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు ఆదేశించినా రాజీనామా చేశానని.... తనకు పదవులు త్రుణప్రాయమన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఓనర్లమని క్లీనర్‌గా మారారు..
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ విరుచుకుపడ్డారు. భాజపాలో చేరికపై స్పందించిన మంత్రులు... ఈటలకు ఆత్మగౌరవంపై మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు ఓనర్లమని చెప్పి దిల్లీకి వెళ్లి క్లీనర్లుగా మారారని ఎద్దేవా చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఇం'ధనం' వంద
దేశవ్యాప్తంగా పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. రెండ్రోజుల వ్యవధిలోనే చమురు సంస్థలు మరోసారి పెట్రోల్ ధరలను పెంచాయి. ఫలితంగా రాష్ట్రంలోని 5 జిల్లాల్లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా వంద రూపాయలు దాటింది. అసలే కరోనాతో కుదేలైన వేళ.. అదనపు భారం మోపడం దారుణమని.. సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'పర్యావరణాన్ని రక్షించుకోవాలి'
జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. భూగోళంపై తలెత్తే సమస్యలను పరిష్కరించుకొనే దిశగా ప్రకృతిని తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రస్తుతం భూగోళం పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కుంటుందన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఆయుధ సంపత్తి
నౌకాదళం కోసం దేశీయంగా ఆరు శక్తిమంతమైన జలాంతర్గాముల నిర్మాణం చేపట్టే మెగా ప్రాజెక్టుకు రక్షణశాఖ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దాదాపు రూ.43వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.