క'న్నీటి'పాలు
వానకాలం సాగుకు సంతోషంగా సన్నద్ధం కావాల్సిన రైతులు... కష్టాల్లో మునిగిపోయారు. ఎండకాలంలో పండించిన ధాన్యం.. కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు.. అన్నదాతను నిండా ముంచాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు.. చెరువుల్లా మారాయి. నెల నుంచి నిరీక్షించినా... ధాన్యం కొనలేదని.. చివరకు పూర్తిగా నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'కరోనా కేసులు తగ్గాయి'
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ఇవాళ కొత్తగా 2,261 కరోనా కేసులు నమోదయ్యాయని, కొవిడ్‌తో మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. మహమ్మారి బారి నుంచి మరో 3,043 మంది బాధితులు కోలుకున్నారన్న ఆయన.. పాజిటివిటీ రేటు 2 శాతంగా ఉందన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్లపై లాక్డౌన్ ప్రభావం
లాక్డౌన్ ప్రభావం నుంచి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ బయట పడలేకపోతోంది. లాక్డౌన్ సడలింపు గడువు పొడిగించడం వల్ల మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. అయినా... ఆశించిన స్థాయిలో క్రయవిక్రయదారుల నుంచి స్పందన లేదు. కరోనా ప్రభావంతో బయటికి వచ్చేందుకు జనం భయపడుతున్నారు. మూడు రోజులకు గానూ కేవలం 2,727 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'వైద్యులు దేవుడితో సమానం'
హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో... 30 మెడికల్ మొబైల్ యూనిట్ బస్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చిన 'ది లార్డ్స్ చర్చి' బృందాన్ని కేటీఆర్ అభినందించారు. కొవిడ్ వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం మరోసారి అందరికీ తెలిసిందన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
వర్ష సూచన
కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని... వాటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు చోట్ల అతి భారీ వర్షాలు నమోదైనట్లు వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.