సర్వేకు సిద్ధం
రాష్ట్రంలో వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. డిజిటల్ సర్వే ఏజెన్సీలతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సర్వే విధివిధానాలపై ఏజెన్సీలతో చర్చించారు. ఇంచు కూడా తేడా రాకుండా సాంకేతికత వాడాలని సీఎం ఆదేశించారు. జూన్ 11 నుంచి పైలట్ విధానంలో డిజిటల్ సర్వే నిర్వహించనున్నారు. తొలుత 27 గ్రామాల్లో పైలట్ విధానంలో ఈ సర్వే చేపట్టనున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
కరోనా విజృంభణ
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ఇవాళ కొత్తగా 2,384 కరోనా కేసులు, 17 మరణాలు నమోదయ్యాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
చికిత్సల ధరలపై హైకోర్టు అసంతృప్తి
రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలపై కొత్త జీవో జారీ చేయకపోవడం కోర్టు ధిక్కరణేనని వ్యాఖ్యానించింది. జీవో ఇవ్వకపోతే ఈనెల 10న వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి విచారణకు హాజరై... వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తే చికిత్సలు రద్దు చేయడం కన్నా.. బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పించేలా చర్యలు ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'రుతు'పవనాలు
కేరళను గురువారం నైరుతి పవనాలు తాకనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని పరిస్థితులు వర్షాలకు అనుగుణంగా ఉన్నాయని.. ఈ క్రమంలోనే నైరుతి పవనాలు కూడా కేరళ చేరతాయని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
విదేశీ టీకాల రాకకు లైన్‌క్లియర్!
దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడ్డ క్రమంలో.. విదేశీ టీకాలకు(Corona Vaccine) అనుమతి ప్రక్రియల్లో డీసీజీఐ మార్పులు చేసింది. డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన కొవిడ్-19 టీకాలు భారత్‌లో బ్రిడ్జ్ ట్రయల్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తాజాగా వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.