600 మంది ఎస్బీఐ ఉద్యోగులకు కరోనా
రెండో వేవ్‌లో తెలంగాణ రాష్ట్రంలో ఆరువందల మందికిపైగా ఎస్బీఐ ఉద్యోగులు కరోనా భారీన పడడంతో యాజమాన్యం కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టింది. రేపటి నుంచి సగం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో పని చేసేట్లు చర్యలు తీసుకున్నట్లు ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం ఓం ప్రకాష్ మిశ్ర తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3రోజుల పాటు వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బియ్యం గింజలతో చిత్రపటం
శ్రీరామునిపై వినూత్నంగా భక్తి చాటుకుంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక. శ్రీ రామనవమి సందర్భంగా బియ్యం గింజలపై రామనామం రాసి వాటితో చిత్రపట్టాన్ని తయారు చేసింది. అందుకోసం 3,216 బియ్యం గింజలను వినియోగించినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'కొవాగ్జిన్' 78 శాతం ప్రభావవంతం
కొవాగ్జిన్ టీకా.. కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో 78 శాతం సమర్థతను ప్రదర్శించినట్లు భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ ప్రకటించాయి. మూడో దశ క్లీనికల్ ట్రయల్స్‌కు సంబంధించి రెండో విడత మధ్యంతర ఫలితాలు వెల్లడించాయి. టీకా తీసుకున్న వారికి కరోనా సోకినప్పటికీ అది ప్రాణాంతకంగా పరిణమించకుండా అడ్డుకోవడంలో కొవాగ్జిన్ టీకా 100 శాతం సమర్థతను రుజువు చేసుకుందని తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'90 శాతం కొవిషీల్డ్ టీకాలే '
కొవిడ్-19 కట్టడి కోసం దేశవ్యాప్తంగా అందిస్తున్న వ్యాక్సిన్ డోసుల్లో 90 శాతానికి పైగా కొవిషీల్డ్ టీకాలే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేవలం కొవిషీల్ట్ టీకాను మాత్రమే అందజేసినట్లు ఓ నివేదికలో కేంద్రం వెల్లడించింది. మరోవైపు.. అత్యంత వేగంగా 95 రోజుల్లోనే 13 కోట్ల డోసులు పంపిణీ చేసి భారత్ మరో మైలురాయిని అధిగమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.